- Telugu News Photo Gallery Viral Photos: These female bus drivers are breaking the glass ceiling in Delhi
Viral News: ఆకాశంలో సగం.. అన్నింటా సగం అంటోన్న మహిళలు.. బస్సు డ్రైవర్లగా మహిళలు
మహిళలు అన్నింటా మగవారితో సమానమే.. ఆకాశంలో సంగం.. అన్నింటా సగం అంటూ.. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బడా బడా వాహనాలు లారీలు, బస్సులు వంటి వాహనాలను సమర్ధవంతంగా డ్రైవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మూస పద్ధతులను విడనాడి సమాజంలో మరింత మార్పు తెచ్చే విధంగా మొదటి బ్యాచ్ మహిళా బస్సు డ్రైవర్లు సిద్ధంగా ఉన్నారు. మహిళలు మంచి డ్రైవర్లు కాదనే కొందరి భావాన్ని తాము మార్చగలమని ఈ 11 మంది మహిళలు చెబుతున్నారు.
Updated on: Aug 25, 2022 | 7:08 AM

ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ నుండి మొత్తం 11 మంది మహిళా బస్సు డ్రైవర్లు తమ అపాయింట్‌మెంట్ లెటర్‌లను స్వీకరించారు. ఈ మహిళలు బస్సు డ్రైవర్లుగా తమ వృత్తిని ప్రారంభించనున్నారు. త్వరలో వివిధ మార్గాల్లోని బస్సుల్లో వీరిని డ్రైవర్లగా నియమిస్తారు

మహిళలు అసాధారణంగా భావించే వృత్తిని ఎంచుకున్నారు. మహిళలు తలచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారంటూ తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు ఒక ఉదాహరణగా నిలిచారు. మహిళలు మంచి డ్రైవర్లు కాదనే సాధారణ భావనను తాము మార్చగలమని వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కారు డ్రైవర్ల నుండి డ్రైవింగ్ చేసే ఉద్యోగం వరకూ ఈ మహిళల జర్నీ సగీటింది. పూర్తిగా విభిన్న నేపథ్యం నుంచి వచ్చిన ఈ మహిళలు తమ కలల ఉద్యోగాన్ని కొనసాగించడానికి వ్యక్తిగత స్థాయిలో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది.

కొత్తగా నియమితులైన డిటిసి బస్సు డ్రైవర్లలో ఒకరైన కోమల్ చౌదరి.. చాలా సార్లు ప్రయాణీకులు 'అన్నా వాహనం ఆపు' అంటారు. అప్పుడు కండక్టర్ వారితో 'అన్న కాదు.. అక్క అని చెప్పాడని గుర్తు చేసుకున్నారు.

కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ మహిళ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఒక మహిళ ఒక పెద్ద పబ్లిక్ వాహనాన్ని నడుపుతూ ఉండటం చూసి ప్రజలు కొంచెం ఆశ్చర్యపోయారని చెప్పారు.

ఈ సందర్భంగా ఢిల్లీ రవాణా మంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ రాబోయే కాలంలో 'మిషన్ పరివర్తన్' కింద 200 మందికి పైగా మహిళా డ్రైవర్లను DTC బస్సు సర్వీసులకు నియమించనున్నట్లు తెలిపారు




