Phani CH |
Updated on: Aug 24, 2022 | 5:41 PM
సాధరణంగా సీనియర్ హీరోయిన్స్ సిస్టర్ మదర్ రోల్స్‌కు షిప్ట్ అవుతారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం కొత్త ట్రెండ్ నడుస్తోంది. తెర మీద సీనియర్ హీరోయిన్ అన్న ట్యాగ్ సొంత చేసుకున్న బ్యూటీస్.. తెర వెనుక సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఇన్నాళ్లు హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
ఈ ఆలోచన చాలా కాలంగా ఉన్నా... ఇదే సరైన సమయం అని ఫీల్ అవుతున్నా అంటూ తన నిర్ణయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు బెబో.
ప్రజెంట్ బాలీవుడ్‌లో నిర్మాతలుగా మారిన హీరోయిన్ల నెంబర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. రీసెంట్‌గా కపూర్ ఫ్యామిలీ క్యూటీ ఆలియా భట్ కూడా ప్రొడ్యూసర్‌గా మారారు.
తన టేస్ట్‌కు తగ్గ సినిమాలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అన్న ఆలియా... తొలి ప్రయత్నంగా డార్లింగ్ సినిమాను రూపొందించారు.
ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ లేడీస్ కంగనా, తాప్సీ కూడా నిర్మాతలుగా బిజీగా ఉన్నారు. ఈ మధ్యే మణికర్ణిక ఫిలింస్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసిన కంగనా వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.
తాప్సీ కూడా అవుట్ సైడర్స్ ఫిలింస్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసిన బ్లర్ అనే సినిమాను రూపొందించారు. ఇలా వరుసగా హీరోయిన్స్ నిర్మాతలుగా మారుతుండటంతో... మరికొంత మంది బ్యూటీస్ ఇదే బాటలో నడిచే ఆలోచనలో ఉన్నారు.