Vinayaka Chavithi: మీ రాశి ప్రకారం.. గణేష్ చతుర్థి రోజున ఏ రంగు వినాయకుడికి పూజ చేయాలంటే..

హిందువుల ఇళ్లలో మాత్రమే కాదు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఈ పండుగ ఇప్పుడు దేశమంతటా జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో  ఏ రాశివారికి ఏ రంగు గణపతి విగ్రహం .. సుఖ సంపదలను ఇస్తుందో ఈరోజు తెలుసుకుందాం..   

Vinayaka Chavithi: మీ రాశి ప్రకారం.. గణేష్ చతుర్థి రోజున ఏ రంగు వినాయకుడికి పూజ చేయాలంటే..
Ganesh Idol
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 29, 2022 | 6:19 PM

Vinayaka Chavithi: దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను పిల్లలు, పెద్దలు ఆనందంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీన గణేష్ చతుర్థి పర్వదినం జరుపుకోనున్నారు. హిందువుల ఇళ్లలో మాత్రమే కాదు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఈ పండుగ ఇప్పుడు దేశమంతటా జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో  ఏ రాశివారికి ఏ రంగు గణపతి విగ్రహం .. సుఖ సంపదలను ఇస్తుందో ఈరోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి గులాబీ లేదా ఎరుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజించాలి. సమయంలో లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి.

వృశ్చిక రాశి:  ఈ రాశి వారు తమ ఇంటికి ముదురు ఎరుపు రంగు గణపతి విగ్రహాన్నిఏర్పాటు చేసుకోవాలి. లడ్డూ , మోతీచూర్‌ని ప్రసాదంగా పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

మిథునరాశి:  ఈ రాశి వారు లేత ఆకుపచ్చ గణపతి విగ్రహాన్ని ఇంటిలో ప్రతిష్టించాలి. ప్రసాదంగా మోదకాన్ని గణపయ్యకు నివేదించవచ్చు.

కన్య రాశి:  ఈ రాశి వారు తమ ఇంటిలో ముదురు ఆకుపచ్చ గణపతి విగ్రహాన్నిఏర్పాటు చేసుకోవచ్చు. నారింజ రంగు లడ్డూను ప్రసాదంగా సమర్పించాలి.

వృషభ రాశి: ఈ రాశి వారు లేత పసుపు గణపతి విగ్రహాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలి.

తులారాశి: ఈ రాశి వారు తెల్ల గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి. ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించవచ్చు.

మీన రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి పసుపు గణపతి విగ్రహాన్ని తెచ్చి ఎర్రటి పూలతో అలంకరించి మోదకాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

మకర రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి లేత నీలం రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించాలి. మోదకం నైవేద్యంగా సమర్పించాలి.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వారు తమ ఇంటికి గంధ సింధూరం రంగు గణపతి విగ్రహాన్ని  పూజించాలి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి తెల్లటి గణపతి విగ్రహాన్ని పూజించాలి. మోతీచూర్ లడ్డూని నైవేద్యంగా సమర్పించాలి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు పసుపు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి పసుపు పూలతో అలంకరించుకోవాలి.

కుంభ రాశి: ఈ రాశి వారు తమ ఇంటిలో ముదురు నీలం రంగు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)