Horoscope Today: వీరు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.. అనవసర ఖర్చులు కూడా.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
వీరు ఉద్యోగం విషయంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. శివనామం జపించడం వల్ల శుభం కలుగుతుంది.
మేషం
శ్రమాధిక్యం పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు ఉంటాయి. శని ధ్యానం వల్ల శుభం కలుగుతుంది.
వృషభం
శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. పరమేశ్వరుడిని సందర్శిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
మిథునం
భవిష్యత్ ప్రణాళికలపై ఒక నిర్ణయానికి వస్తారు. తోటివారితో కలిసి విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గట్లుగానే ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శివుడిని పూజిస్తే మంచి కలుగుతుంది.
కర్కాటకం
కీలక పనులు, విషయాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. హానిక కలగజేసే కొంతమందిని దూరం పెట్టడం మంచిది. పరమేశ్వరుడిని ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు.
సింహం
మంచి పనులు, కార్యక్రమాలు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. మనసుకు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయస్వామిని ప్రార్థిస్తే మంచిది.
కన్య
ఉద్యోగం విషయంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. శివనామం జపించడం వల్ల శుభం కలుగుతుంది.
తుల
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తలపెట్టిన పనుల్లో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
వృశ్చికం
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకుంటారు. వినాయకుడిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది.
ధనస్సు
కొందరు గిట్టనివారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకూడదు. దుర్గా దేవిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
మకరం
శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా సానుకూల ఫలితాలున్నాయి. కొన్ని నిర్ణయాలు ఫలిస్తాయి. విందులు, వినోదాలు, శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.
కుంభం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కీలక పనులు, విషయాల్లో బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సప్తమంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. నవగ్రహ ఆలయ సందర్శనం వల్ల శుభం కలుగుతుంది.
మీనం
చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శ్రీరామనామాన్ని జపించడం వల్ల మేలు జరుగుతుంది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.