Viral video: బాహుబలి స్టైల్‌లో ఫీట్ చేయాలనుకుంది.. ఏనుగు ఇచ్చిన దెబ్బకు దిమ్మతిరిగింది.. నెట్టింట్లో వైరల్ వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది కన్‌క్లూజన్ చాలామంది చూసే ఉంటారు. అందులో ఓ సన్నివేశంలో ప్రభాస్ ఏనుగు తొండం సహాయంతో దానిపైకి ఎక్కికూర్చుంటాడు. వీఎఫ్‌ఎక్స్ సహాయంతో రీల్ ప్రపంచంలో ఇలాంటి సీన్లను ఎన్నో క్రియేట్ చేయవచ్చు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది కన్‌క్లూజన్ చాలామంది చూసే ఉంటారు. అందులో ఓ సన్నివేశంలో ప్రభాస్ ఏనుగు తొండం సహాయంతో దానిపైకి ఎక్కికూర్చుంటాడు. వీఎఫ్‌ఎక్స్ సహాయంతో రీల్ ప్రపంచంలో ఇలాంటి సీన్లను ఎన్నో క్రియేట్ చేయవచ్చు. కానీ రియల్ లైఫ్‌లో చేయడానికి వెళ్తే మాత్రం ఎముకలు విరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఓ మహిళ ప్రభాస్ లాగే ఏనుగు తొండం సహాయంతో పైకి ఎక్కి సవారి చేయాలనుకుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తొండంపైకి ఎక్కగానే ఏనుగు ఒక్కసారిగా జూలు విదిలిస్తుంది. దెబ్బకు తొండంపై ఉన్న ఆ అమ్మాయి నీటిలో పడిపోతుంది. నీటిలో ఇదంతా జరిగింది కాబట్టి ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.
@LockerRoomLOL అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన వారందరూ భిన్నరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘ఇలాంటి స్టంట్లు మనకెందుకు తల్లి’, ఈ ఈ స్టంట్ ఫెయిలయ్యాక, ఆ మహిళ ఏనుగుపై స్వారీ చేసే ముందు వందసార్లు ఆలోచిస్తుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
AWW ELEPHANT!! pic.twitter.com/BkE75hD4PT
— LOCKERROOM (@LockerRoomLOL) August 24, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..