Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cats sharing food: ఫుడ్‌ షేర్‌ చేసుకుంటున్న పిల్లులు.. ఈ క్యూట్ వీడియో చూసి నెటిజన్లను ఫిదా..!

Cats sharing food: ఫుడ్‌ షేర్‌ చేసుకుంటున్న పిల్లులు.. ఈ క్యూట్ వీడియో చూసి నెటిజన్లను ఫిదా..!

Anil kumar poka

|

Updated on: Aug 26, 2022 | 9:59 AM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వాటిలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు వాటిని ఇష్టపడతారు కూడా.


నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వాటిలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు వాటిని ఇష్టపడతారు కూడా. వీటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని షాక్ ఇస్తుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా మనం ఏదైనా తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వారితో షేర్‌ చేసుకుంటాం. ఇలా మనమే కాదు… జంతువులు కూడా ఆహారాన్ని షేర్‌ చేసుకుంటాయండోయ్‌.. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఓ ఇంట్లో రెండు పిల్లులు ఉన్నాయి. వాటిలో ఒకదానికి చిన్న బౌల్‌లో ఆహారం పెట్టారు. దాని పక్కనే మరో పిల్లి ఉంది. దాంతో తనకు పెట్టిన ఆహారాన్ని తన పక్కనున్న మరోపిల్లితో షేర్‌ చేసుకుని తింటుంది. అవి పోట్లాడుకోకుండా ఎంతో ప్రేమగా ఆహారం ఒకదానికొకటి పంచుకుంటూ తింటుంటాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను ఆలోచింపచేస్తుంది. ఆ పిల్లుల స్నేహానికి ఫిదా అయిపోతూ..రకరకాలుగా స్పందిస్తున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 26, 2022 09:03 AM