Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
అంతా చూస్తుండగానే దారుణం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు.
అంతా చూస్తుండగానే దారుణం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ మరిగే జావ నుంచి అతను బయటపడగలిగాడు. కానీ.. చివరికి ఈ ఘటన విషాదంగా ముగిసింది. మధురైలో జులై 29న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం బాధితుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల కోసం జావను వండి.. ప్రజలకు పంచుతారు. ముత్తు మారియమ్మ ఆలయం పక్కన భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు. తూలిపోతూనే ఆ గంజిలో పడిపోయాడు. అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. ముత్తుకుమార్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ గిన్ననే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్‌ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

