Viral Video: మంచులా మిలమిలా మెరిసిపోతున్న అరుదైన తెల్ల కొండచిలువ.. అయోమయానికి గురైన స్థానికులు
White Albino Python: సాధారణంగా పాములు తెల్లగా ఉంటాయి. అవి కూడా అరుదుగానే కనిపిస్తాయి. అయితే కర్ణాటకలో మాత్రం మంచులా మిలమిలా మెరిపిపోతున్న తెల్లని కొండచిలువ ప్రత్యక్షమైంది.
White Albino Python: సాధారణంగా పాములు తెల్లగా ఉంటాయి. అవి కూడా అరుదుగానే కనిపిస్తాయి. అయితే కర్ణాటకలో మాత్రం మంచులా మిలమిలా మెరిపిపోతున్న తెల్లని కొండచిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్ జిల్లా మిర్జాన్‌లోని రాంనగర్‌లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో ఈ అరుదైన కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువల కన్నా భిన్నంగా ఉన్న ఈ కొండ చిలువను చూసి అతనితో పాటు స్థానికులు అయోమయానికి గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్‌సంఘటనా స్థలానికి చేరుకొని దానిని పరిశీలించాడు. దీనిని తెల్లని కొండ చిలువ అని నిర్ధారించారు.
మెలనిన్ లోపం కారణంగా పాము చర్మం తెల్లగా మారుతుందని.. దీన్ని అల్బినో స్నేక్ గా పిలుస్తారని పవన్ నాయక్ తెలిపారు. అనంతరం కొండచిలువను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో దాన్ని వదిలేశారు. ఇలాంటి తెల్ల కొండచిలువలు చాలా అరుదు అని, కనిపిస్తే చంపేయకుండా తమకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే ఇదే కర్ణాటక రాష్ట్రంలోని బంత్వాల్ లో ఇలాంటి తెల్ల కొండచిలువ హల్‌చల్ చేసింది.అలాగే శివమొగ్గ జిల్లాలో రెండుసార్లు శ్వేతనాగు కనిపించింది.
It’s very rare !! A white albino, was found in #Bantwal of #Karnataka, this #WhitePython was caught by snake catcher Kiran at house of Naushad, as per the instructions of forest department this very rare white reptile was later released in jungle.@indiatvnews @IndiaTVHindi pic.twitter.com/Wx7X6ZgG99
— T Raghavan (@NewsRaghav) June 4, 2020
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..