Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కళ్లజోడు ఎత్తుకెళ్లి కలెక్టర్‌కు చుక్కలు చూపించిన వానరం.. చివరకు వాటిని ఆశ చూపిస్తే కానీ..

Uttar Pradesh: కోతులు ఎంత తుంటరి పనులు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనుషుల చేతుల్లోని తిండి పదార్థాలు, స్మార్ట్‌ఫోన్లను అమాంతం లాక్కెళ్లుతుంటాయి. ఎదురుతిరిగితే మనుషులపై ఎదురు దాడికి కూడా పాల్పడుతుంటాయి.

Viral Video: కళ్లజోడు ఎత్తుకెళ్లి కలెక్టర్‌కు చుక్కలు చూపించిన వానరం.. చివరకు వాటిని ఆశ చూపిస్తే కానీ..
Monkey
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2022 | 7:43 AM

Uttar Pradesh: కోతులు ఎంత తుంటరి పనులు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనుషుల చేతుల్లోని తిండి పదార్థాలు, స్మార్ట్‌ఫోన్లను అమాంతం లాక్కెళ్లుతుంటాయి. ఎదురుతిరిగితే మనుషులపై ఎదురు దాడికి కూడా పాల్పడుతుంటాయి. కోతుల చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. అధికారిక పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ కళ్లజోడును అందరూ చూస్తుండగానే కోతి ఎత్తుకెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌తో పాటు పోలీసు సిబ్బంది, అధికారులు బతిమిలాడినా ఆ కోతి కళ్లద్దాలు తిరిగి ఇవ్వలేదు. చివరకు రెండు ఫ్రూటీ ప్యాకెట్లను ఇస్తే కానీ కోతి మాట వినలేదు. వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్ లోని మథుర జిల్లాలోని బృందావనం బాంకే బిహారీ మందిర్ మార్గంలో జిల్లా కలెక్టర్ నవనీత్ చాహల్, ఇతర జిల్లా అధికారులు పర్యటిస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న కలెక్టర్ భుజం మీద ఉన్నట్టుండి ఓ కోతి వచ్చి కూర్చుంది. దీంతో అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు . కలెక్టర్ ని కోతి ఏమైనా చేస్తుందేమోనని అందరూ టెన్షన్‌ పడ్డారు. అయితే కలెక్టర్‌ ధరించిన కళ్లజోడు అందంగా కనిపించిందేమో ఉన్నట్లుండి దానిని తీసుకెళ్లి పక్కనే ఉన్న ఓ ఇంటి మెట్లపై ఎక్కి కూర్చుంది. పాపం కలెక్టర్‌ తన కళ్లద్దాలను ఇవ్వమని ఎన్ని రకాలుగా ప్రాథేయపడినా కోతి అసలు వినలేదు. పోలీసులు, ఇతర సిబ్బంది కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా కోతి మాత్రం అసలు తగ్గలేదు. చివరకు రెండు ఫ్రూటీ ప్యాకెట్లను ఆశ చూపిస్తే కోతి స్పందించింది. వెంటనే కళ్లజోడును పారేసి ఫ్రూటీ ప్యాకెట్లు అందుకుంది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా యూపీ ప్రతిపక్షనేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. బీజేపీ పాలనలోని దుష్ప్రవర్తనను అధికారులు చూడడం లేదు. అందుకే.. వారికి కళ్లజోడు అవసరం లేదని కోతి భావించి లాక్కెళ్లింది అంటూ తనదైనశైలిలో సెటైర్లు వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..