Viral Video: పాడుబడిన బావిలో ఆరు పాములు.. చాకచక్యంగా బయటకు తీసుకొచ్చిన స్నేక్ క్యాచర్.. వీడియో చూస్తే వణుకే
Shocking Video: పాములు పట్టడంలో స్నేక్ క్యాచర్లకు ఎంతో నేర్పరి కలిగి ఉంటారు. అయితే ఒక్కోసారి దురదృష్టవశాత్తూ వారు కూడా పాము కాలుకు బలై ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి సంఘటనలు ఇటీవల చాలానే జరిగాయి.
Shocking Video: పాములు పట్టడంలో స్నేక్ క్యాచర్లకు ఎంతో నేర్పరి కలిగి ఉంటారు. అయితే ఒక్కోసారి దురదృష్టవశాత్తూ వారు కూడా పాము కాలుకు బలై ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి సంఘటనలు ఇటీవల చాలానే జరిగాయి. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన మురళీవాలే హౌస్లా అనే వ్యక్తి డేరింగ్ స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతటి ప్రమాదకర పాములనైనా ఇట్టే పట్టుకుని బంధిస్తాడు. అంతేకాదు వీటికి సంబంధించిన వీడియోలను తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఆ ఛానెల్ నిండా స్నేక్ క్యాచింగ్ వీడియోలే ఉంటాయి. తాజాగా అతను మరొకసారి తన ధైర్యాన్ని చాటుకున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ప్రమాదకర పాములను పట్టుకుని..
ఉత్తరప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామానికి మురళి వెళ్లాడు. అక్కడి పంట పొలాల్లో ఉన్న ఓ పాడుబడిన బావిలో చాలాకాలంగా ఆరు విషపూరిత పాములు ఉంటున్నాయి. వాటిని పట్టుకునేందుకు అక్కడకు వెళ్లాడు మురళి. దీంతో గ్రామస్తులందరూ బావి దగ్గరకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఆ బావి మధ్యలో ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. ఏదైనా అనర్థం జరిగితే వెంటనే పైకి రావడం చాలా కష్టం. అయితే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వెనకడుగు వేయని నిచ్చెన సాయంతో మురళి బావిలోకి దిగాడు. లోపలికెళ్లాక బావి చుట్టూ అక్కడక్కడా మొత్తం ఆరు పాములు కనిపించాయి. ఇందులో రెండు కింగ్ కోబ్రాలు, రెండు రక్త పింజర, మరో రెండు ఇతర విషపూరిత పాములు ఉన్నాయి. తనదగ్గరున్న స్నేక్ క్యాచింగ్ స్టిక్ సాయంతో పని మొదలెట్టిన మురళి ఒక్కో పామును చాకచక్యంగా పట్టేశాడు. ఆపై వాటిని సంచుల్లో బాధించాడు. కొన్ని పాములను చేయితో గట్టిగా తల వద్ద పట్టుకుని వాటి నోరు తెరిచి గ్రామస్తులకు చూపించాడు. అలా మొత్తం ఆరు పాములను సంచుల్లో బంధించాడు. ఆపై నిచ్చెన సహాయంతో పైకి వచ్చాడు. ఇలా ఎంతో నేర్పరితనంతో మురళీ పాములు పట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు అతని ధైర్యాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..