Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: టైసన్‌ ఆ సైజ్‌ చెప్పులు వేసుకుంటాడా? లైగర్‌ కోసం ఈ బాక్సింగ్‌ దిగ్గజాన్ని పూరి ఎలా ఒప్పించాడో తెలుసా?

బాక్సింగ్ గురించి తెలిసిన వారికి మైక్‌ టైసన్‌ (Mike Tyson) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాక్సింగ్‌ రింగ్‌లో తన పవర్‌ పంచులతో ప్రత్యర్థులను హడలెత్తించిన ఈ లెజెండరీ బాక్సర్‌ ఇప్పుడు ఇండియన్‌ సిల్వర్‌స్ర్కీన్‌పై మెరవనున్నాడు.

Liger: టైసన్‌ ఆ సైజ్‌ చెప్పులు వేసుకుంటాడా? లైగర్‌ కోసం ఈ బాక్సింగ్‌ దిగ్గజాన్ని పూరి ఎలా ఒప్పించాడో తెలుసా?
Liger
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2022 | 7:43 AM

బాక్సింగ్ గురించి తెలిసిన వారికి మైక్‌ టైసన్‌ (Mike Tyson) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాక్సింగ్‌ రింగ్‌లో తన పవర్‌ పంచులతో ప్రత్యర్థులను హడలెత్తించిన ఈ లెజెండరీ బాక్సర్‌ ఇప్పుడు ఇండియన్‌ సిల్వర్‌స్ర్కీన్‌పై మెరవనున్నాడు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన లైగర్‌ (Liger) సినిమాతో టైసన్‌ నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఇందులో ఆయన పాత్ర ఏంటి? విజయ్‌తో టైసన్‌కు ఫైటింగ్‌ సీక్వెన్స్‌ ఉంటాయా? లేదా? అని సినీ ప్రియులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా దీనిపై డైరెక్టర్‌ పూరీ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో నటించేందుకు మైక్‌ను ఎలా ఒప్పించాడో కూడా అభిమానులతో పంచుకున్నారు.

విజయ్‌ అలా అడగ్గానే టెన్షన్‌ మొదలైంది.. లైగర్‌ సినిమాలోని కీలక పాత్ర కోసం టైసన్‌ను తీసుకోవాలని ఎందుకు అనిపించిందో మాకే తెలియదు. ఆయనను ఈ సినిమాలో నటింపజేసేందుకు మాకు ఏడాదికి పైగా పట్టింది. ముందుగా ఆయన టీంకి వందల సంఖ్యలో ఈ మెయిల్స్‌ పంపేవాళ్లం. ఎన్నోసార్లు జూమ్‌ కాల్స్‌ కూడా మాట్లాడాం. ‘మాకు మొత్తం స్క్రిప్టు పంపండి’ అని టైసన్‌ టీం అడిగింది. చివరకు ఎలాగో మా ప్రయత్నం ఫలించింది. షూటింగ్‌ కోసం టీమ్‌ మొత్తం లాస్‌వేగాస్‌ వెళ్లాం. మైక్‌ టైసన్‌ వస్తున్నారని చెప్తే మా సినిమాకి పనిచేసిన అక్కడి సాంకేతిక నిపుణులు నమ్మలేదు. మరోవైపు ‘సార్‌.. టైసన్‌ వస్తారా? ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంటి?’ అని విజయ్‌ నా దగ్గరకు అడగ్గానే మరింత భయమేసింది. ఇంతలో ‘ఇక్కడ ఏం జరుగుతోంది?’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు మైక్‌. బ్రూస్‌లీ, మైకేల్‌ జాక్సన్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి టైసన్‌. అలాంటి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషం. సాధారణంగా మనం తొమ్మిదో, పదో నంబరో సైజ్‌ చెప్పులు కొంటాం. కానీ, ఆయన చెప్పుల సైజు 20. దీంతో మేం ప్రత్యేకంగా ఆయనకు బూట్లు తయారు చేయించాం. ఇక లైగర్‌ సినిమాలో విజయ్‌, మైక్‌ టైసన్‌ మధ్య ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటాయని.. అయితే అది కేజ్‌లో కాదు’ అని చెప్పుకొచ్చారు పూరీ. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే, రమ్యకృష్ణ తదితరులు నటిస్తోన్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో (ఆగస్టు 25)న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి