Liger : “లైగర్”తో ఫైటింగ్ దిగిన ఈ బ్యూటీ ఎవరబ్బా..!! వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ వీడియో
మరికొద్ది గంటల్లో లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది
మరికొద్ది గంటల్లో లైగర్(Liger) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా లో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్, సాంగ్స్ సినిమా పై ఆసక్తిని క్రియే చేశాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ అయితే ఫ్యాన్స్ అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ కు తల్లిపాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు.
ఇక లైగర్ సు స్పెషల్ అట్రాక్షన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటించనున్నారు. లైగర్ మూవీలో టైసన్ ను డిఫరెంట్ గా చూపించనున్నాడట పూరి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో సందడి చేశారు లైగర్ టీమ్. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిహారిక ఎన్.ఎం సోషల్ మీడియా యూజర్. సినిమా తారలతో రకరకాల వీడియోలు చేసి వైరల్ అవుతూ ఉంటుంది ఈ భామ. తాజాగా విజయ్ దేవర కొండతో కూడా ఓ ఫన్నీ వీడియో చేసింది ఈ అమ్మడు. విజయ్ తో ఈ బ్యూటీ ఫన్నీగా ఫైటింగ్ కు దిగింది. ఆ తర్వాత తప్పించుకోవడానికి ప్రయతించింది. ఇప్పుడు ఈవీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram