Vijay Deverakonda: “నాకు అలా చేయడం అస్సలు ఇష్టముండదు”.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లైగర్. రౌడీ హీరో డబుల్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి లైగర్ తో రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లైగర్(Liger). రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) డబుల్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి లైగర్‌తో రెడీ అవుతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు లైగర్ టీమ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతుండగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో పర్యటిస్తూ హంగామా చేశారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ముంబై షాపింగ్ మాల్ లో ప్రమోషన్స్ అంటే అందరిని పిలిచి నా సినిమా గురించి చెప్పాలేమో అనికున్నా కానీ ఇక్కడ రెస్పాన్స్ చూసి షాక్ అయ్యా అని అన్నారు విజయ్. ముఖ్యంగా యూత్ నుంచి అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అసలు నేను యాక్టర్ ను అవుతాననే అనుకోలేదు.. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంత రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా షాకింగ్ గా ఉంది అన్నారు. కొన్ని ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు స్టేజ్ పైన డాన్స్ చేయమని అంటుంటారు. నాకు స్టేజ్ పైన డాన్స్ చేయడం నచ్చదు.. స్టేజ్ పై డాన్సులు చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అన్నారు.