AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: అదిరేటి సినిమాలు/ వెబ్‌సిరీస్‌లతో ఓటీటీలు సిద్దం.. ఈ వారం రిలీజయ్యే లిస్టు ఇదే!

ఏ ఓటీటీలో.. ఏ సినిమా రిలీజ్ అవుతుందోనని సెర్చ్ చేసేవారు పెరిగిపోయారు. ఎక్కువగా డబ్బులు ఖర్చుపెట్టుకుని..

OTT Movies: అదిరేటి సినిమాలు/ వెబ్‌సిరీస్‌లతో ఓటీటీలు సిద్దం.. ఈ వారం రిలీజయ్యే లిస్టు ఇదే!
Ott Movies
Ravi Kiran
|

Updated on: Aug 23, 2022 | 1:52 PM

Share

ఇప్పుడంతా ట్రెండ్ మారింది గురూ.. థియేటర్లలో పాప్‌కార్న్ తింటూ సినిమాలు చూసేవాళ్ల సంఖ్య తగ్గింది. ఏ ఓటీటీలో.. ఏ సినిమా రిలీజ్ అవుతుందోనని సెర్చ్ చేసేవారు పెరిగిపోయారు. ఎక్కువగా డబ్బులు ఖర్చుపెట్టుకుని సినిమా థియేటర్లకు వెళ్లే బదులు ఇంటిల్లిపాది ఓటీటీలలో ఒకటి కంటే ఎక్కువసార్లు సినిమాను చూడవచ్చునంటూ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లకు జై కొడుతున్నారు. మరి ఇదే తరుణంలో అదిరేటి సినిమాలు/ వెబ్‌సిరీస్‌లతో ఓటీటీలు సిద్దమైపోయాయి. ఈ వారం రిలీజయ్యే లిస్టు ఎలా ఉందో తెలుసుకుందాం..

కట్‌పుట్లి:

అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా దర్శకుడు రంజిత్ తివారీ తెరకెక్కించిన చిత్రం ‘కట్‌పుట్లి’. తెలుగులో హిటైన రాక్షసుడు’ సినిమాకు ఇది రీమేక్. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

టాప్‌గన్ మార్వెరిక్:

టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం టాప్‌గన్ మార్వెరిక్. ఈ యాక్షన్ డ్రామా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టే ఈ చిత్రం ఆగష్టు 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఢిల్లీ క్రైమ్(సీజన్ 2):

షెఫాలీషా ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ అత్యంత పాపులారిటీని సంపాదించింది. దీని రెండో భాగం ఆగష్టు 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఢిల్లీలో జరిగిన ఓ సంచలన క్రైమ్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది.

మహారాణి(సీజన్ 2):

హుమా కురేషీ ప్రధాన పాత్రలో రూపొందిన మహారాణి తొలి సీజన్.. వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్టు 25 నుంచి సీజన్ 2.. సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు ‘She-Hulk’ రెండో ఎపిసోడ్ ఆగష్టు 25న హాట్ స్టార్‌లో.. ఆగష్టు 26 నుంచి ‘సమరిటన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ‘మేడ్‌ ఇన్‌ చెల్సియా- మాలోర్కా’ వెబ్ సిరీస్ ఆగష్టు 23 నుంచి హేయూ ఓటీటీ ద్వారా అందుబాటులో ఉంటుంది.

మరోవైపు విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘లైగర్’ చిత్రం ఆగష్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందింది. ఆ తర్వాతి రోజు అనగా ఆగష్టు 26న భలా చోర భళా, కళాపురం, పీకే వంటి చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?