Vijay Sethupathi: విడుదలైన 4 ఏళ్లకు ఓటీటీలోకి రాబోతున్న విజయ్ సేతుపతి సినిమా.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). మెగా డాటర్ నిహారిక కొణిదెల జంటగా నటించిన ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్‏గా నిలిచింది.

Vijay Sethupathi: విడుదలైన 4 ఏళ్లకు ఓటీటీలోకి రాబోతున్న విజయ్ సేతుపతి సినిమా.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 23, 2022 | 1:32 PM

ప్రస్తుతం థియేటర్‏లో సినిమాలు రిలీజ్ అయిన నెలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మిశ్రమ స్పందన సంపాదించుకున్న చిత్రాలు మాత్రం రెండు వారాలకే స్ట్రీమింగ్ అవుతుంటే..బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు 50-80 రోజులలో డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తున్నాయి. కానీ ఓ సినిమా మాత్రం రిలీజ్ అయిన నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. అదే ఓ మంచి రోజు చూసి చెప్తా. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). మెగా డాటర్ నిహారిక కొణిదెల జంటగా నటించిన ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమాకు ఆరుముగా కుమార్ దర్శకత్వం వహించగా.. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మించారు. ఇందులో విజయ్ సేతుపతి, నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ మూవీ ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా ఆగస్ట్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది ఆహా. ఇందులో విజయ్ దొంగతనాలు చేసే యముడిగా విజయ్ కనిపించగా.. యువరాణి పాత్రలో నిహారిక నటించింది. సేతుపతిని మామయ్య అంటూ పిలుస్తుంది. కామెడీ ఎంటర్టైనర్‏గా రానున్న ఈ చిత్రంలో గౌతమ్ కార్తిక్ కీలకపాత్రలో నటించాడు. అలాగే జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. గాయత్రీ శంకర్, వీజి చంద్రశేఖర్, రమేష్ తిలక్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంలో ఈ సినిమాను ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్ టైటిల్‍తో విడుదలైంది. తాజాగా ఆహా విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ