Amala Paul: ఆ హీరోలతో నటించడం వల్ల ఒత్తిడికి గురయ్యాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమలా పాల్..

నేను సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదు. ఇక్కడ నాకు సరైనా గైడెన్స్ ఇచ్చేవారు లేరు. కానీ నా సొంత

Amala Paul: ఆ హీరోలతో నటించడం వల్ల ఒత్తిడికి గురయ్యాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమలా పాల్..
Amala Paul
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 23, 2022 | 8:09 AM

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అమలా పాల్ ( Amala Paul ). మైనా చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 18 ఏళ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేసిన అమలా.. కెరీర్ ఆరంభంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దాదాపు 12 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఆమె ఎన్నో కష్టాలను అనుభవించానని.. తనకంటే పెద్ద వయసులో ఉన్న హీరోలతో నటించడంతో చాలా ఒత్తిడికి గురయ్యినట్లు చెప్పింది. ఇటీవల ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా మాట్లాడుతూ.. పెద్ద వయసు హీరోలతో నటించే సమయంలో చాలా ఒత్తిడి ఉంటుందని..అంతేకాకుండా తనకు ఎదురైన అనుభవాలు, తప్పుల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది.

అమలాపాల్ మాట్లాడుతూ.. “జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాను. 18 ఏళ్ల వయసులో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను. నేను నటించిన మైనా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇండస్ట్రీలో వయసును ఎవరు పరిగణనలోకి తీసుకోరు. నాకంటే చాలా పెద్ద వయసులో ఉన్న హీరోలతో నటించాను. ఆ సమయంలో నేను ఒత్తిడికి గురయ్యాను. నేను సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదు. ఇక్కడ నాకు సరైనా గైడెన్స్ ఇచ్చేవారు లేరు. కానీ నా సొంత అనుభవాలు, తప్పుల వలన చాలా నేర్చుకున్నాను. అయినా నాకు ఇది ఒక అందమైన అనుభవం. నేను మనిషిగా, నటిగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడింది. నా ప్రయాణం, ఎదురైన అడ్డంకులను ఎదుర్కోగలిగినందుకు చాలా గర్వపడుతున్నాను. నాకంటే చిన్నవాళ్లకు ఇప్పుడు నేను సలహాలు ఇవ్వగలుగుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన కడవర్ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఆమె పోలీస్ సర్జన్ పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.