Megastar Chiranjeevi Birthday: అట్లుంటది మరి.. బాస్ క్రేజ్ అంటే.. మెగాస్టార్‌కు జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన ఫ్యాన్స్..
తమ అభిమాన హీరోకు సరికొత్తగా విషెస్ చెబుతూ.. తమ ప్రేమను తెలియజేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని గద్వాల్ ఫ్యాన్స్ చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ఉప్పుతో చిరు చిత్రపటాన్ని వేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు నేడు (ఆగస్ట్ 22). గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికుడిగా కొనసాగడమే కాకుండా సామాజిక సేవలోనూ తనవంతూ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అందుకే చిరును అభిమానించేవారు సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అన్నయ్య అంటూ ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ ఇప్పటికే పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తమ అభిమాన హీరోకు సరికొత్తగా విషెస్ చెబుతూ.. తమ ప్రేమను తెలియజేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని గద్వాల్ ఫ్యాన్స్ చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ఉప్పుతో చిరు చిత్రపటాన్ని వేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుందామా.
మెగాస్టార్ చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు ఆయన ఫ్యాన్స్. పుట్టిన రోజు జరుపుకుంటోన్న చిరంజీవికి డిఫరెంట్‌గా విషెష్ చెప్పారు గద్వాల మెగా ఫ్యాన్స్. ఉప్పుతో మెగాస్టార్ చిరు చిత్రపటాన్ని గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు(spot). గద్వాల జిల్లా అంతటా చిరంజీవి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయ్. సంబరాలు అంబరాన్నంటేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే, చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు గద్వాల ఫ్యాన్స్. గద్వాల పట్టణంలోని రాయచూరు రోడ్డులో 30 క్వింటాళ్ల ఉప్పు, లవంగాలతో చిరంజీవి చిత్రపటాన్ని రూపొందించారు. 250 ఫీట్ల అడ్డం, 400 ఫీట్ల పొడవుతో మెగాస్టార్ చిత్రాన్ని నిర్మించి మెగా అభిమానాన్ని చాటుకున్నారు. బోయ జమ్మన్న ఆధ్వర్యంలో ఇలా మెగాస్టార్‌కి విషెస్ చెప్పారు.
గద్వాలలో నిర్వహించిన చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మెగా ఫ్యాన్స్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా డిఫరెంట్‌గా మెయిన్ రోడ్డుకు పక్కన పొలంలో రూపొందించిన చిరంజీవి చిత్రపటాన్ని చూసి మురిసిపోతున్నారు అభిమానులు. వినూత్నంగా ఏర్పాటుచేసిన చిరు ఫొటో …ఫ్యాన్సే కాదు, అటువైపుగా వెళ్తున్న వాళ్లందరినీ ఆకట్టుకుంటోంది. మెగా ఫ్యాన్సా? మజాకా?. మెగా ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు మరి అంటున్నారు గద్వాల ప్రజలు.