AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..

సంగీతం అనేది మనసుకు హాయి ని కలిగించడమే కాదు. కొన్ని రోగాలను కూడా నయం చేస్తుందని అంటుంటారు. ఓ చక్కటి సంగీతం వింటే మనసు తేలికవుతుంది. టెన్షన్స్, స్ట్రెస్ లాంటివి అంతో ఇంతో తగ్గుతాయి. ఇక సినిమా పాటలు ఎంతో మంది పై ప్రభావం చూపుతాయి. అది మంచిదైనా.. చెడ్డదైనా.. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి.

ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..
Song
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2026 | 5:56 PM

Share

జనాలపై సినిమాల ప్రభావం ఎంత ఉంటుందో పాటల ప్రభావం కూడా అంతే ఉంటుంది. సినిమా పాటలైనా, జానపద పాటలైనా ప్రేక్షుకులు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాల్లో పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక ప్రేమగీతాలకు ఉండే క్రేజే వేరు. లవ్ సాంగ్స్ ఎప్పటికీ బోర్ కొట్టావు.. విషాదా గీతాలు కూడా ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్థానం స్పందించుకుంటుంటాయ్.. అలాంటి ఓ సాంగ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.. 2004లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. లవ్ స్టోరీ కథతో తెరకెక్కిన ఈ సినిమా కేవలం యువతనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.

ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

ఆ సినిమా ఎదో కాదు 2004లో విడుదలైన ప్రేమిస్తే.. తమిళ్ లో కాదల్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ప్రేమిస్తే పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో భరత్, సంధ్య హీరో, హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. జాషువా శ్రీధర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసిన సాంగ్ అంటే టక్కున చెప్పే సాంగ్ జన్మ నీదేలే.. మరు జన్మ నీకేలే సాంగ్.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

ఈ సాంగ్ ను హరిచరణ్ ఆలపించారు. తల్లిదండ్రులను కాదనుకొని ప్రేమించిన వాడితో వచ్చేసిన యువతీ కోసం తన ప్రియుడు పాడే ఈ సాంగ్ ఎంతో హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా లిరిక్స్ “గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే ఎన్నడు దేవత పూజకు నొచవులే..” “తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగ నే ఉన్నా..”” అంటూ సాగే లిరిక్స్ ప్రేక్షుకులను కట్టిపడేశాయి. ఈ సాంగ్ వింటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్ ఇది.

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us