స్పీడు చూపిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరోలు
టాలీవుడ్‌లో ఎంత మంది కథానాయకులు ఉన్నా, మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ గురించి అభిమానులు నిత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య ఉన్న కొన్ని విషయాలను పోల్చుకుంటూ ఆనందిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏడాది చిరంజీవి, వచ్చే ఏడాది బాలకృష్ణ అనే అంశంపై అభిమానులు ఆసక్తికరమైన చర్చలు జరుపుతున్నారు.
చిరంజీవి ఇప్పటికే శంకరవర ప్రసాద్ చిత్ర విజయంతో ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన విశ్వంభర చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉంది. దీని ఆధారంగా 2026లో మెగాస్టార్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదలయ్యాయని సమాచారం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వాల్తేరు వీరయ్య కాంబో వచ్చే ఏడాది తెరపైకి రానుంది.చిరంజీవి ఈ ఏడాది చేసిన ఫీట్‌ను నందమూరి బాలకృష్ణ వచ్చే ఏడాది చూపించబోతున్నారని టాక్. గోపీచంద్ మలనేని దర్శకత్వంలో బాలకృష్ణ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వీరసింహారెడ్డి వైబ్‌ను మళ్లీ సృష్టిస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సెట్స్‌పై ఉన్న సినిమాతో పాటు, బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్టును కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
ధురంధర్ జోరుకు బ్రేక్ వేసిందెవరు..?
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్స్
వామ్మో.. ఇన్ని బైకులు కొట్టేశారేంట్రా.. షోరూమ్ పెడతారా ఏంటి?
మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ..
560 రోజులుగా 400 అడుగుల ఎత్తయిన టవర్ పైనే.. కారణం ఇదే!
సింధు కణతపై ఏమిటా స్టిక్కర్..!
వామ్మో.. అతని ఒంటి నిండా తేనెటీగలే..!
యూట్యూబ్ వీడియోలతో కోట్లు కొల్లగొడుతున్న స్టార్లు
శ్రీవారినిజీవితంలో ఒక్కసారైనా..ఇలా చూశారా?

