AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్‏ను చూడగానే ఏడ్చేసిన అమ్మాయి.. రౌడీకి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేసిన వీరాభిమాని..

తాజాగా బెంగుళూరులో లైగర్ ప్రమోషన్లలో పాల్గోన్న విజయ్ ను చూసి తేజు అనే యువతి ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వెంటనే తన వద్ద ఉన్న రింగ్ తీసి రౌడీ వెలికి తొడికి ప్రపోజ్ చేసింది.

Vijay Deverakonda: విజయ్‏ను చూడగానే ఏడ్చేసిన అమ్మాయి.. రౌడీకి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేసిన వీరాభిమాని..
Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2022 | 7:51 AM

Share

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. యూత్‏లో యమ ఫాలోయింగ్ వచ్చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఫెవరేట్ హీరో అయ్యిడు విజయ్. అభిమానులంతా రౌడీ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ హీరో ప్రస్తుతం లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు విజయ్. ఇక రౌడీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. ఇప్పటికే నార్త్‏లోని పలు నగరాల్లో నిర్వహించిన ఫ్యాన్‏డమ్ ఈవెంట్లకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. అలాగే ఇటీవల గుంటూరులో నిర్వహించిన లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో విజయ్ కోసం ఏకంగా ఓ అమ్మాయి స్టేజ్ పైకి వచ్చేసింది. తాజాగా బెంగుళూరులో లైగర్ ప్రమోషన్లలో పాల్గోన్న విజయ్ ను చూసి తేజు అనే యువతి ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వెంటనే తన వద్ద ఉన్న రింగ్ తీసి రౌడీ వెలికి తొడికి ప్రపోజ్ చేసింది. అనంతరం తన అభిమాన హీరోను కలవడంతో భావోద్వేగానికి గురయ్యింది. ఆ అమ్మయి చూపించిన అభిమానానికి విజయ్ సైతం ఫిదా అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

విజయ్‏ను చూసి ఆనందంతో ఆ యువతి మోకాళ్లపై కూర్చుని.. రౌడీ వెలికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేయడంతో హీరో సైతం ఆమెతోపాటు మోకాళ్లపై కూర్చున్నాడు. అనంతరం లైగర్ ప్రమోషన్స్ అయ్యేవరకు ఆ రింగ్‏ను తన చేతికి అలాగే ఉంచుకుంటునాని మాటిచ్చాడు. దీంతో సదరు యువతి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ అమ్మాయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఈరోజు నేను మై బేబీ విజయ్ దేవరకొండను కలిశాను. అతనికి ఉంగరంతో ప్రపోజ్ చేశాను. ఆ రింగ్ ను మూవీ ప్రమోషన్స్ వరకు ధరిస్తానని మాటిచ్చాడు.. లవ్ యూ మచ్ బేబీ అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై ఛార్మి, కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో అనన్య పాండె కథానాయికగా నటించగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్, విషు కీలకపాత్రలలో నటించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!