Sai Dharam Tej: మెగా కార్నివాల్‏లో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్.. చేదు సంఘటనను గుర్తుచేసుకున్న సుప్రీం హీరో..

గతేడాది ప్రమాదం జరిగిన తర్వాత కోలుకుని ఇప్పుడు మీ ముందుకొచ్చి మాట్లాడతానని అనుకోలేదు. అందుకు తన ఆనందం మాటల్లో చెప్పలేనిదనీ అన్నారు సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej: మెగా కార్నివాల్‏లో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్.. చేదు సంఘటనను గుర్తుచేసుకున్న సుప్రీం హీరో..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 22, 2022 | 7:11 AM

మెగా ఫ్యామిలీ నుంచి పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను అలరించిన తేజ్.. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, జవాన్, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే చేతి నిండ ప్రాజెక్టులతో కెరీర్ మంచి ఫాంలో దూసుకుపోతున్న తేజ్ జీవితంలో ఓ సంఘటన జరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో తేజ్ కు యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. మాదాపూర్ వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. ఇక గత కొద్ది రోజుల క్రితం పూర్తిగా కోలుకున్నారు తేజ్. కోలుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆయనకు వెల్ కమ్ చెప్పిన ఫోటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన తర్వాత తేజ్ ఎక్కువగా బయట కనిపించలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్ డే వేడుకల సందర్భంగా జరిగిన మెగా కార్నివాల్‏లో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

గతేడాది ప్రమాదం జరిగిన తర్వాత కోలుకుని ఇప్పుడు మీ ముందుకొచ్చి మాట్లాడతానని అనుకోలేదు. అందుకు తన ఆనందం మాటల్లో చెప్పలేనిదనీ అన్నారు సాయి ధరమ్ తేజ్. అంతేకాకుండ.. తనకు మామయ్య బర్త్ డే వేడుకలంటే.. పండగతో సమానమనీ..చిన్నప్పుడు మామయ్య బర్త్ డే కోసం వేయి కళ్లతో ఎదురు చూసేవారమనీ అన్నారు. అంతే కాదు.. తన పేరు ముందు సుప్రీం హీరో అన్నది బిరుదు కాదనీ.. అదొక సెంటిమెంటుగా అభివర్ణించారు. తాను ఎంత ఎదిగినా.. హిట్ ఫ్లాపులెన్ని వచ్చినా సరే.. ఈ పేరొక శ్రీరామరక్షగా చెప్పారు సాయి ధరమ్. అందుకే సుప్రీం హీరో అనేది తన ఇంటిపేరుగా మార్చుకున్నాననీ అన్నారు సాయి ధరమ్ తేజ్. ఎందుకంటే సుప్రీం హీరో అంటే అది మామయ్య చిరుకు గతంలో ఉన్న పేరనీ.. ఆ పవరే తన జీవితాంతం వెన్నంటి ఉండాలన్న ఉద్దేశంతో ఇలా తన పేరు ముందు పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు తేజ్. ప్రస్తుతం తేజ్ సుకుమార్ శిష్యుడు దండు కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చూస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?