AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Maruthi : ఆ యంగ్ హీరోతో మారుతి సినిమా చేయనున్నాడా.?

మారుతి దర్శకత్వంలో ఇటీవలే రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన మారుతి.. ఏకంగా ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేశారు మారుతి. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

Director Maruthi : ఆ యంగ్ హీరోతో మారుతి సినిమా చేయనున్నాడా.?
Maruti
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2026 | 9:03 PM

Share

తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. మొన్నటివరకు వరుస హిట్స్ తో ప్రేక్షుకులను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. మొన్నటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్నమారుతి. రీసెంట్ గా ప్రభాస్ తో సినిమా చేశాడు రాజాసాబ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షుకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమ నిరాశపరచడంతో ఇప్పుడు మారుతి ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. రాజా సాబ్ తర్వాత మరో పెద్ద హీరోతో చేస్తాడా.? లేక యంగ్ హీరోతో సినిమా చేసి మరోసారి ట్రాక్ లోకి వస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

అయితే మారుతి ఇప్పుడు ఓ యంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆహీరో ఎవరో కాదు రామ్ పోతినేని. ఈ యంగ్ హీరో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. చివరిగా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

ఈ క్రమంలోనే మారుతి ఓ అందమైన లవ్ స్టోరీతో రామ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలాగే మారుతి వరుణ్ తేజ్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు అనే సినిమా చేస్తున్నాడు. మరి మారుతి ఈ ఇద్దరి హీరోల్లో ఎవరితో సినిమా చేస్తారో చూడాలి. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us