AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో వల్లే చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యా.. అసలు విషయం చెప్పిన జేడీ చక్రవర్తి

తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. గులాబీ సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న చక్రవర్తి.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ తర్వతా పలు చిత్రాల్లో సహయ నటుడిగా కనిపించారు.

ఆ హీరో వల్లే చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యా.. అసలు విషయం చెప్పిన జేడీ చక్రవర్తి
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 27, 2026 | 9:10 AM

Share

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తన నటనా ప్రస్థానం, కెరీర్ ఎంపికల గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. గాయపడ్డ సింహం సినిమా టీజర్‌లో తన పాత్ర సత్య, మనీ సినిమా కామెడీని గుర్తుచేసేలా ఉందని యాంకర్ అడిగినప్పుడు. జేడీ మాట్లాడుతూ.. దర్శకులు తన గత చిత్రాల నుండి రిఫరెన్స్‌లను స్పూఫ్ చేయకుండా, వాటికి వాస్తవికతను జోడిస్తూ కొత్త కోణంలో చూపిస్తున్నారని వివరించారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా పాత సినిమాల స్ఫూర్తితోనే కథను తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. గాయపడ్డ సింహం సినిమా తన కెరీర్ అప్రోచ్‌ను మార్చిందని జేడీ చక్రవర్తి వెల్లడించారు. గతంలో చాలా చూజీగా, సెలెక్టివ్‌గా ఉండే తాను ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని బర్త్‌డే రోజున చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణం పవన్ సాధినేని దర్శకత్వం వహించిన దయా వెబ్ సిరీస్ అని జేడీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే

ఇక ఇండస్ట్రీ తనకు ఎప్పుడూ అవకాశాలు ఇవ్వలేదని చెప్పడం తప్పు అని జేడీ చక్రవర్తి అన్నారు. తాను సినిమాలు చేయకపోవడం తన వ్యక్తిగత నిర్ణయమే తప్ప, తనకు అవకాశాలు రాలేదని కాదని ఆయన స్పష్టం చేశారు. తనకు నచ్చే ఒక అంశం, ఒక హై, కిక్ లభించినప్పుడే సినిమాలు చేస్తానని, అది మళ్ళీ గాయపడ్డ సింహంతో లభించిందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద అభిమానిని అని, అయితే ఆయనతో కలిసి పనిచేయాలనే తన కోరిక ఇప్పటికీ తీరలేదని జేడీ చక్రవర్తి అన్నారు. అన్నయ్య సినిమాలో పాత్రల కోస తనను శ్రీకాంత్ ను సంప్రదించారని, అయితే మొదట శ్రీకాంత్‌ను అడిగారని, శ్రీకాంత్ అంగీకరించి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో ఆ అవకాశం మిస్ అయిందని వివరించారు. తాను చిరంజీవితో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని, ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?

అలాగే, తాను దర్శకుడిగా చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించిన మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తయినా, అది మధ్యలోనే ఆగిపోయిందని గుర్తు చేసుకున్నారు. తమ మధ్య ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం ప్రకృతి ఎదురుచూస్తోందని, అందుకే ఈ చిన్న ప్రాజెక్ట్‌లు పూర్తికావడం లేదని జేడీ చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవిని మొదటిసారి చూసినప్పుడు ఎంత ఉత్సాహంగా ఫీల్ అయ్యారో, ఇప్పటికీ అంతే ఉత్సాహంగా ఉంటానని తెలిపారు. కొత్తతరం దర్శకులకు తనలాంటి నటులు తోడుగా ఉంటే నిజంగా మ్యాజిక్ జరుగుతుందని నమ్ముతున్నట్లు జేడీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us