AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకేసారి ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ రెండూ తీసుకోవచ్చా.. ఏది బెటర్ అంటే.?

ఒకేసారి ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ తీసుకోవడం సాధ్యమేనా? మీ పేయింగ్ కెపాసిటీ, సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు లోన్లను ఎలా మంజూరు చేస్తాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి మరి. ఈ వివరాలు మీకోసమే.. అదేంటంటే..

ఒకేసారి ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ రెండూ తీసుకోవచ్చా.. ఏది బెటర్ అంటే.?
Education Loan Vs Personal
Ravi Kiran
|

Updated on: Apr 27, 2026 | 8:53 AM

Share

మనం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పుడు మనకు ఉండే అతిపెద్ద కలలు రెండు. ఒకటి, మన పిల్లలను గొప్పగా చదివించడం, రెండు.. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండటం. అయితే ఈ రెండింటికీ భారీగా ఖర్చు అవుతుంది. చేతిలో ఉన్న పొదుపు మొత్తం దీనికి సరిపోదు. అప్పుడే మనకు ‘లోన్’ అనే ఆలోచన వస్తుంది. కానీ చాలామందికి ఉండే ఒక పెద్ద సందేహం ఏంటంటే.. “నేను ఇప్పటికే పిల్లల చదువు కోసం లోన్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంటి కోసం లోన్ ఇస్తారా?” లేదా “ఈ రెండూ ఒకేసారి అప్లై చేయొచ్చా?” అని. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

నిజానికి, బ్యాంకులు మీకు లోన్ ఇచ్చేటప్పుడు చూసే ప్రధాన అంశం మీ ‘పేయింగ్ కెపాసిటీ’. అంటే, మీరు తీసుకున్న అప్పును తిరిగి కట్టే స్తోమత మీకు ఉందా లేదా అన్నది మాత్రమే వారు చూస్తారు. మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం నుంచి 50 శాతం లోపు ఈఎంఐలు ఉంటే, మీరు ఎన్ని లోన్లకైనా అర్హులే. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండి, ఆదాయ మార్గాలు స్పష్టంగా ఉంటే ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ రెండూ ఒకేసారి తీసుకోవచ్చు. అయితే, ఈ రెండింటిలో ఏది ముందు తీసుకోవాలి అని అడిగితే, ఎడ్యుకేషన్ లోన్‌కే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చదువు అనేది భవిష్యత్తుపై చేసే పెట్టుబడి, ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు కానీ చదువుకునే సమయం తిరిగి రాదు కదా!

ఇక లోన్ ప్రక్రియలో సిబిల్ స్కోర్ ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే బ్యాంకులు వడ్డీ రేట్లలో కూడా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ‘కో-అప్లికెంట్’గా చేరి జాయింట్ లోన్ తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తం లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా మహిళల పేరు మీద లోన్ తీసుకుంటే ప్రభుత్వం మరియు బ్యాంకుల నుండి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి. లోన్ తీసుకోవడం అనేది ఒక బాధ్యత, దాన్ని సరైన ప్లానింగ్‌తో చేస్తే మన కలలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. చదువు ద్వారా వచ్చే జ్ఞానం, దాని ద్వారా పెరిగే ఆదాయం మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది.

ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్