AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్‌తో సినిమా చేసి తప్పుచేశా..! శేఖర్ కమ్ముల గట్టిగానే హర్ట్ అయ్యాడుగా..!!

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు అంటే టక్కున చెప్పే పేరు శేఖర్ కమ్ముల.. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది . శేఖర్ కమ్ముల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనో.. లేదా మన పక్క ఇంట్లోనో జరిగిన కథల్లానే ఉంటాయి.

Rajeev Rayala
|

Updated on: Apr 26, 2026 | 8:14 AM

Share
దర్శకుడు శేఖర్ కమ్ముల.. టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు ఎంతో సహజంగా, సామాన్య ప్రేక్షకులకు బాగా దగ్గర ఉంటాయి. మన చుట్టూ జరిగే కథలనే సినిమాలుగా తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు ఈ స్టార్ డైరెక్టర్. గతంలో ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..  బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, రికార్డులపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా, సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలని తాను కోరుకుంటానని ఆయన తెలిపారు. తన కెరీర్‌లో తీసిన చిత్రాలు ఆర్థికంగా ఎప్పుడూ నష్టపోలేదని ఆయన గర్వంగా చెప్పారు.

1 / 5
అనమిక చిత్రం థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందకపోయినా, ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక భద్రతను తాను ఎప్పుడూ చూసుకుంటానని, ఆ తర్వాతే బ్లాక్ బస్టర్, భారీ వసూళ్ల గురించి ఆలోచిస్తానని ఆయన వివరించారు. కాగా శేఖర్ కమ్ముల, స్టార్ హీరోయిన్ నయనతార మధ్య పదేళ్ల క్రితం జరిగిన ఓ గొడవ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నయనతార నటించిన చిత్రాలలో అనామిక ఒకటి, దీనికి దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా బాలీవుడ్ లో విద్యా బాలన్ నటించిన సూపర్ హిట్ కహానీకి రీమేక్.

2 / 5
ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటించినా, సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడంలో విఫలమైంది. దీనికి ప్రధాన కారణం నయనతార ప్రమోషన్లలో పాల్గొనకపోవడమేనని అప్పట్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఒక చిత్ర దర్శకుడిగా, శేఖర్ కమ్ముల సినిమా విజయం సాధించాలంటే నటీనటులు ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనాలని బలంగా విశ్వసిస్తారు. అయితే, నయనతార తాను నటించిన చిత్రాల ప్రమోషన్లకు దూరంగా ఉండటం సాధారణం. ఈ విషయంలోనే శేఖర్ కమ్ముల, నయనతార మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని టాక్.

3 / 5
అలాగే ఆ సినిమా నయనతార లాంటి స్టార్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం.. అయితే నయనతార లాంటి స్టార్‌తో ఆ సినిమా తీయకుండా ఉండాల్సింది.. అప్పటికే దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన సంచలనం సృష్టించింది. దాంతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకున్నా.. కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా పడకుండా ఉండాల్సింది. అని శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సంఘటన తర్వాత శేఖర్ కమ్ముల రీమేక్ చిత్రాలకు కూడా దూరంగా ఉంటున్నారు. 

4 / 5
ప్రస్తుతం శేఖర్ కమ్ముల యూత్, కుటుంబ ప్రేక్షకులలో ఒక బ్రాండ్ గా మారారు. ప్రస్తుతం కేవలం కథకు ప్రాధాన్యత ఇస్తూ స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నారు. నయనతార సినిమాల విషయానికి వస్తే, ఆమె కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ప్రస్తుతం సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. 

5 / 5
Follow Us