AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh Diet Secrets: రకుల్ ప్రీత్ సింగ్ డైట్ ప్లాన్ తెలిస్తే షాకవుతారు! ఆ మూడే తన ఫిట్‌నెస్ రహస్యమట!

ప్రస్తుత కాలంలో డైటింగ్ అంటే కేవలం సలాడ్లు, ఉడికించిన కూరగాయలు మాత్రమే తిని ఆకలితో అలమటించడం అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అన్నం అసలు ముట్టుకోరని, కేవలం బ్రౌన్ రైస్ మాత్రమే తింటారని ఒక వార్త ప్రచారంలో ఉంది.

Rakul Preet Singh Diet Secrets: రకుల్ ప్రీత్ సింగ్ డైట్ ప్లాన్ తెలిస్తే షాకవుతారు! ఆ మూడే తన ఫిట్‌నెస్ రహస్యమట!
Rakul Singh
Nikhil
|

Updated on: Feb 22, 2026 | 6:15 AM

Share

తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకునే ఆ స్టార్ హీరోయిన్ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మన ఇంట్లో లభించే అత్యంత సాధారణమైన పదార్ధాలే తన ఆరోగ్య రహస్యాలని ఆమె చెబుతోంది. ఆ హీరోయిన్​ డైట్ సీక్రెట్స్, ఆరోగ్య సూత్రాలేంటో తెలుసుకుందాం..

తెరపై అత్యంత ఫిట్‌గా, గ్లామరస్‌గా కనిపించే ఆ భామ డైట్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సాధారణంగా హీరోయిన్లు కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటారని మనం వింటూ ఉంటాం. కానీ, ఆమె మాత్రం రోజూ మధ్యాహ్నం కచ్చితంగా అన్నం తింటానని, అది కూడా తెల్ల అన్నమే తన ఫేవరెట్ అని చెబుతోంది. జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఆ మూడు సులభమైన ఆహార పదార్ధాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫిట్‌నెస్ ఐకాన్ మరెవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్.

గట్ హెల్త్ కోసం..

ఇటీవల ‘ఖానే మే క్యా హై’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మన కడుపునకు అత్యంత తేలికగా అనిపించే మూడు పదార్ధాలు ఇవేనని ఆమె పేర్కొంది.

  • అన్నం: ఇది సులభంగా జీర్ణమవుతుంది. అందుకే అనారోగ్యం ఉన్నప్పుడు కిచిడీ తింటే ఉపశమనం లభిస్తుందని రకుల్ వివరించింది.
  • అరటిపండు: తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు జీర్ణక్రియకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
  • చిలగడదుంప: ఇవి సింపుల్ కార్బ్స్ కాబట్టి శరీరానికి త్వరగా అందుతాయి.

చాలామంది బ్రౌన్ రైస్ తింటేనే బరువు తగ్గుతారని అనుకుంటారు. కానీ రకుల్ మాత్రం తాను కేవలం వైట్ రైస్ మాత్రమే తింటానని స్పష్టం చేసింది. ఆమె డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే.. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనంలో కచ్చితంగా అన్నం ఉంటుంది. రాత్రి పూట మాత్రం రోటీ తీసుకుంటుంది. “నేను నా ఆహారాన్ని తూకం వేయను, కానీ నాకు ఎంత తినాలో తెలుసు” అని ఆమె పేర్కొంది. ఆహారాన్ని శుభ్రంగా, పద్ధతిగా వండుకుంటే ఎక్కువ తిన్నా ఇబ్బంది ఉండదని రకుల్ సూచించింది.

కాంప్లెక్స్ కార్బ్స్ కంటే సింపుల్ కార్బ్స్ శరీరానికి త్వరగా అరిగిపోతాయని, ఇవి గట్ హెల్త్ కు మేలు చేస్తాయని 34 ఏళ్ల రకుల్ వివరించింది. ఏ ఆహారమైనా మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవడం వల్ల ఫిట్‌గా ఉండవచ్చని ఆమె నిరూపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన విషయాలను బట్టి చూస్తే.. మన సంప్రదాయ ఆహారమే అత్యుత్తమమని అర్థమవుతోంది. అన్నం, అరటిపండు, చిలగడదుంప వంటి సాధారణ వస్తువులతోనే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆమె చెబుతోంది. మరి మీరు కూడా బ్రౌన్ రైస్ కష్టాలు వదిలేసి, రకుల్ లాగా వైట్ రైస్ తో డైటింగ్ మొదలుపెడతారా?

Follow Us