అనుపమ పరమేశ్వరన్పై క్రష్.. మనసులో మాట బయటపెట్టిన ప్రముఖ లిరిసిస్ట్!
దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అందాల అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు క్రేజీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

టాలీవుడ్లో తన అందంతో పాటు నటనతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మపై తనకున్న అభిమానాన్ని ప్రముఖ పాటల రచయిత కాసర్ల శ్యామ్ ఆసక్తికరంగా వెల్లడించారు. అనుపమను మొదటిసారి చూసినప్పుడే క్రష్ ఏర్పడిందని చెబుతూ.. ఆమెను ఆరాధిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అనుపమ పరమేశ్వరన్, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. తాజాగా ‘క్రేజీ కల్యాణం బరాత్’ పేరుతో మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుపమ అంటే తనకు క్రష్ అని, ఆమెను మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నానని సరదాగా తన మనసులోని మాటను బయటపెట్టారు. అనుపమపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ కాసర్ల శ్యామ్ మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆమెను తాను ‘అఆ’ అని పిలుస్తానని చెప్పారు. ఇందులో ‘అ’ అంటే అనుపమ అని, ‘ఆ’ అంటే ఆరాధన అని వివరించారు. అనుపమను తాను అంతలా ఆరాధిస్తానని చెబుతూ.. ఆమెకు తాను అభిమానిగా మారిపోయానని వెల్లడించారు.
అంతేకాదు.. అనుపమకు నటనతో పాటు పాటలు పాడటంలోనూ మంచి ప్రతిభ ఉందని ప్రశంసించారు. ఆమె గాత్రాన్ని కూడా కాసర్ల శ్యామ్ కొనియాడారు. దీంతో ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినీ వేడుకల్లో సెలబ్రిటీలు చేసే సరదా వ్యాఖ్యలు అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కాసర్ల శ్యామ్ చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అనుపమపై తనకున్న క్రష్ను ఆయన వ్యక్తం చేసిన తీరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు, ‘క్రేజీ కల్యాణం’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ కల్యాణం’ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
