Bigg Boss Prerana: తల్లికాబోతున్న బిగ్బాస్ బ్యూటీ.. రణబాలి స్టైల్లో గ్రాండ్గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్, రష్మిక క్లోజ్ ఫ్రెండ్ ప్రేరణ కంభం త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఇటీవలే ఆమెనే స్వయంగా ఈ శుభవార్తను అందరితో షేర్ చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక గ్రాండ్గా జరిగింది

బిగ్బాస్ తెలుగు బ్యూటీ, హీరోయిన్ రష్మిక స్నేహితురాలు ప్రేరణ కంభం ఇటీవలే తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన భర్తతో కలిసి బేబి బంప్ చూపిస్తూ ఓ వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది ప్రేరణ. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు ప్రేరణకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక గ్రాండ్గా జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఈ వేడకకు హాజరయ్యారు. ప్రేరణ దంపతులకు అభినందనలు, ఆశీర్వాదాలు అందించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రేరణ. రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ రణబాలి లో జయమ్మ పాత్ర సాంగ్తో ఈ వీడియోను జత చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఏందయ్యా సామీ అంటూ సాగే ఈ వీడియోకు ‘మరో విశ్వంలో ఈ జయమ్మ తన వంశం వారసుడు రాక కోసం వేడుక జరుపుకుంటుంది. ఒక సీమంతపు వేడుక వందల ఆశీర్వాదాలు జీవితకాలం ప్రేమ బయటపడటానికి వేచి ఉంది’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రేరణకు రష్మిక క్లోజ్ ఫ్రెండ్ కావడం, జయమ్మ పాత్ర సాంగ్ తో తన సీమంతం వీడియోను జోడించడంతో ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేరణకు, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాల మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నటి అయ్యే ప్రయత్నాల్లో ఉండగానే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాతి కాలంలో రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోగా, ప్రేరణ సీరియల్ హీరోయిన్ గా బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ‘కృష్ణ ముకుంద మురారీ’ అనే సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది ప్రేరణ. ఆ తర్వాత బిగ్బాస్ తెలుగు 8వ సీజన్లో కంటెస్టెంట్ గానూ పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకపోయినా గ్రాండ్ ఫినాలే వరకు వచ్చింది. టాప్-4లో నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది.
ప్రేరణ సీమంతం వీడియో..
View this post on Instagram
ఇక ప్రేరణ భర్త పేరు శ్రీపాద్. 2023లో వీరి వివాహం జరిగింది. సుమారు మూడేళ్ల తర్వాత ఈ దంపతులు అమ్మానాన్నలు కాబోతున్నారు. ఇక ప్రేరణ- శ్రీపాద్ కలిసి ఓంకార్ హోస్ట్ చేసిన ‘ఇస్మార్ట్ జోడీ 3’ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలవడం విశేషం
భర్తతో ప్రేరణ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




