Kanchana birthday: ఆమె పుట్టిన రోజున యావదాస్తిని దేవాలయాలకు ఇచ్చిన గొప్ప నటి..
అచ్చ తెలుగు నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘కాంచన’ పుట్టిన రోజు నేడు. ఎయిర్ హోస్టెస్ నుంచి వెండి తెరపై అడుగు పెట్టిన మెరుపు తీగ.. భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విలక్షణ నటి కాంచన.
అచ్చ తెలుగు నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘కాంచన’ పుట్టిన రోజు నేడు. ఎయిర్ హోస్టెస్ నుంచి వెండి తెరపై అడుగు పెట్టిన మెరుపు తీగ.. భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విలక్షణ నటి కాంచన. సువర్ణ సుందరి సినిమాలో నాగ కన్య పాత్రలో మొదలుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న సమయంలో 1970లో దర్శకుడు శ్రీధర్ ‘ప్రేమించి చూడు’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. వీరాభిమన్యు, కల్యాణ మండపం వంటి సినిమాలు హీరోయిన్ గా కాంచన కెరీర్ కు బంగారు బాట వేశాయి. సాంఘిక చిత్రాల్లోనే కాదు జానపద, పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు. 2017 లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించి ఆశ్చర్యపరిచారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడతో పాటు హిందీలో నటించారు. కాంచన అసలు పేరు పురాణం వసుంధరాదేవి.. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో 1939 ఆగష్టు 16న జన్మించారు. సంపన్న కుటుంబలో పుట్టినా.. ఆర్ధిక పరిస్థితి తారుమారు కావడంతో ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ ప్రారంభించారు. స్టార్ హీరోయిన్ గా కోట్ల ఆస్తులను గడించినా..తల్లిదండ్రులు ఆస్తి కోసం కన్న కూతురిని ఇబ్బంది పెట్టిన విధానం ఒక సినిమాలను తలపిస్తాయని అంటారు. తన యావదాస్తిని పలు దేవాలయాలకు, స్వచ్చంధ సంస్థలకు విరాళం ఇచ్చిన గొప్ప మనసున్న కాంచన.. బ్రహ్మచారిణిగా ఉన్నారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న కాంచన నేడు 83వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కాంచనకు భగవంతుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని టీవీ 9 కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..