Saakini Daakini Teaser: శాకిని-డాకిని టీజర్ వచ్చేసింది.. అదిరిపోయిన వీడియో..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది.

Saakini Daakini Teaser: శాకిని-డాకిని టీజర్ వచ్చేసింది.. అదిరిపోయిన వీడియో..
Shakini Dakini
Follow us

|

Updated on: Aug 23, 2022 | 1:14 PM

టాలీవుడ్ హీరోయిన్స్.. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని డాకిని (Saakini Daakini). డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్‏కు తెలుగు రీమేక్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. (Regina Kasandra) ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది.

ఇందులో ఓసీడీ సమస్యతో ఇబ్బందిపడుతున్న దామిని అనే అమ్మాయిగా రెజీనా కనిపించనుండగా.. ఫుల్ లవర్ శాలినిగా నివేదా థామస్ నటిస్తోంది. వీరిద్దరు పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా జాయిన్ కావడం.. తక్కువగా పనితీరు కనబర్చడం వంటి అంశాలు టీజర్ లో చూపించారు. ఇందులో ఓ నేరస్తుడు అమ్మాయి తలపై కొట్టడం.వీరిద్దరు అమ్మాయిలు వారి తమ నైపుణ్యాలతో ఆ నిందుతుడిని ఎలా ఎదుర్కొంటారు అనేది టీజర్ లో చూపించారు. యాక్షన్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి మైక్ క్లియరీ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles