AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

God Father: తమన్ పై విరుచుకుపడుతున్న నెటిజన్స్.. మెగాస్టార్ సినిమాకు ఇలా చేస్తావా అంటూ కామెంట్స్.. ఎందుకంటే..

ప్రస్తుతం ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. టీజర్ బీజీఎం అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే మరికొందరు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

God Father: తమన్ పై విరుచుకుపడుతున్న నెటిజన్స్.. మెగాస్టార్ సినిమాకు ఇలా చేస్తావా అంటూ కామెంట్స్.. ఎందుకంటే..
God Father
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2022 | 2:00 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. గత రెండు రోజుల ముందుగానే చిరు పుట్టినరోజు వేడుకల సందడి మొదలైంది. సరికొత్తగా అన్నయ్యకు బర్త్ డే విషెష్ తెలియజేశారు మెగా ఫ్యాన్స్. ఇక అభిమానులకు ముందుగానే స్పెషల్ ట్రీట్ ఇచ్చేశారు మేకర్స్. చిరు ప్రస్తుతం నటిస్తోన్న భోళా శంకర్, గాడ్ ఫాదర్ చిత్రాల నుంచి అప్డేట్స్ రివీల్ చేశారు. డైరెక్టర్ మెహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ (God Father) సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చిరు బర్త్ డే సందర్భంగా సోమవారం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. టీజర్ బీజీఎం అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే మరికొందరు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమన్ ఈ సినిమాకు అందిస్తున్న బీజీఎమ్ అచ్చం వరుణ్ తేజ్ గని టైటిల్ సాంగ్‏లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే మ్యూజిక్ మళ్లీ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఉపయోగించారంటూ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ నటించిన గని చిత్రానికి తమనే సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?