Liger: విజయ్‌ సినిమాపై స్వీటీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. తనకు లైఫ్‌ ఇచ్చిన పూరీని ఏమని పిలిచిందో తెలుసా?

Anushka Shetty: ప్రస్తుతం దేశమంతటా మాట్లాడుకుంటోన్న చిత్రం లైగర్‌ (Liger). టాలీవుడ్ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది.

Liger: విజయ్‌ సినిమాపై స్వీటీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. తనకు లైఫ్‌ ఇచ్చిన పూరీని ఏమని పిలిచిందో తెలుసా?
Anushka Shetty
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2022 | 7:43 AM

Anushka Shetty: ప్రస్తుతం దేశమంతటా మాట్లాడుకుంటోన్న చిత్రం లైగర్‌ (Liger). టాలీవుడ్ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యాపాండే హీరోయిన్‌గా నటించగా, రమ్యకృష్ణ, మైక్ టైసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న చిత్రం మరికొన్ని గంటల్లో ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా గురువారం (ఆగస్టు 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రం రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పాన్‌ఇండియా స్థాయికి తగ్గట్టుగానే ప్రమోషన్లు నిర్వహించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోన్న లైగర్‌ సినిమాపై టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కా శెట్టి (Anushka Shetty) స్పందించింది.

కాగా మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. లైగర్‌ పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షిస్తూ చిత్రబృందానికి విషెస్‌ అందిస్తున్నారు. తాజాగా స్వీటీ కూడా సోషల్‌ మీడియా వేదికగా లైగర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నానంటూ తెలిపింది. ఈ పోస్టుపై విజయ్‌ కూడా స్పందించాడు. ‘ థ్యాంక్యూ సోమచ్‌ స్వీటీ.. అర్జున్‌ రెడ్డి సినిమా విడుదలప్పుడు కూడా మీకు ఇలాగే విషెస్‌ చెప్పారు. ఆ సినిమాలాగే లైగర్‌ కూడా సూపర్‌ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్‌ రిప్లై ఇచ్చాడు . కాగా అనుష్క తన పోస్టులో డైరెక్టర్‌ పూరీని ‘ జగ్గుదాదా’ అని సంబోధించడం విశేషం. కాగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ చిత్రంతోనే అనుష్క వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస హిట్లతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది. చివరిసారిగా ఆమె నిశ్శబ్దం చిత్రంలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..