- Telugu News Photo Gallery Viral photos Viral News: Weird Creature With No Butt May Not Be Our Ancient Ancestor After All
Saccorhytus Coronarius: బియ్యం గింజకంటే అతి చిన్న జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మీరు షాకవుతారు
ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు.. ఆశ్చర్యాన్ని కలిగించే వింత జీవులున్నాయి. కొన్ని సార్లు పరిశోధకుల పరిశీలన సమయంలో వెలుగులోకి వచ్చే జీవులను గురించి తెలిస్తే.. షాక్ తింటాము. తాజాగా చీమల పూర్వీక జీవి ని కనుగొన్నారు. ఈ జీవిని పురుగులు, పీతలు , రౌండ్‌వార్మ్‌లతో సరిపోల్చడానికి కూడా ప్రయత్నించారు. ఈ చిన్న వింత జంతువు సారూప్యత మానవుల కంటే తక్కువ, చీమల పూర్వీకుల కంటే ఎక్కువ అని అంటున్నారు శాస్త్రవేత్తలు.
Updated on: Aug 20, 2022 | 1:39 PM

మలమూత్ర విసర్జన చేయడానికి పిరుదులు లేనటువంటి జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది వెన్నెముక గల సకశేరుక జంతువు కాదని నిర్ధారించారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ చిన్న వింత జంతువు సారూప్యత మానవులతో కాదు, చీమల పూర్వీకులతో కలిసినట్లు తెలుస్తోంది. శాస్త్రవేత్తలు ఈ జీవికి సాకోరిటస్ కరోనారియస్( Saccorhytus coronarius) అని పేరు పెట్టారు. నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం ఈ జీవి పరిమాణం బియ్యం గింజ కంటే కొంచెం పెద్దది.

Sciencealert.com నివేదిక ప్రకారం, ఈ జీవి శరీరం దాదాపు 0.04 అంగుళాలు అంటే 0.10 సెంటీమీటర్లు. దాని చర్మం 2 పొరలుగా ఉంది. గట్టిగా ఉంది. చాలా చిన్న సైజులో ఉండే ఈ జీవి శరీరం విసర్జించడానికి వెనుక భాగం లేదు. అది గరుకుగా ఉన్న నోటితో పర్సు లాగా కనిపిస్తోంది. నోటి చుట్టూ రేడియల్ మడతలు, రంధ్రాలు కనిపిస్తున్నాయి. అవి తరువాత గొంతులు, మొప్పల రూపంలో అభివృద్ధి చెందుతాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

ఈ జీవి శరీరంలో పదునైన ఉబ్బెత్తుగా ఉంది. పగడపు రంగులో, ఎనిమోన్స్ , జెల్లీ ఫిష్ ల పోలికలతో ఉంది. దీంతో సాకోరిటస్ కరోనారియస్ జాతిని కనుగొనే విషయంలో అనేక కోణాల్లో పరిశోధించినట్లు బ్రిస్టల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త , ఈ పరిశోధన సహ రచయిత ఫిలిప్ డోనోఘ్యూ చెప్పారు. నోరు కలిగి, పాయువు లేని జీవులైన ఎక్డిసోజోవాన్ కి చెంది ఉండవచ్చంటూ శాస్త్రజ్ఞులు నిర్ధారణకు వచ్చారు.

శాస్త్ర గణ విశ్లేషణ ప్రకారం శరీర నిర్మాణ శాస్త్రాన్ని అన్ని ఇతర జీవుల సమూహాలతో పోలి ఉందని డోనోఘ్యూ చెప్పారు. పరిశోధకులు ఈ జీవిని ఆర్థ్రోపోడ్స్ , కీటకాలు, పీతలు, రౌండ్‌వార్మ్‌ల వంటి వాటితో సరిపోల్చడానికి ప్రయత్నించారు. ఈ చిన్న వింత జంతువు సారూప్యత మానవుల కంటే తక్కువ, చీమల పూర్వీకుల కంటే ఎక్కువ అని కనుగొన్నారు.

ఈ జీవి ఒక జంతు వర్గం నుండి మరొక వర్గానికి మారుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, వర్గీకరణ అనేది అతిచిన్న వివరాలను గుర్తించదగిన లక్షణాలుగా మారడంపై ఆధారపడి ఉంటుంది. ట్రీ ఆఫ్ లైఫ్‌లో ఈ నిర్దిష్ట జీవి ఖచ్చితమైన స్థానం తెలియదని శాస్త్రవేత్తలు అంటున్నారు.




