Wholesale Market: తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. ఈ హోల్ సేల్ మార్కెట్ బెస్ట్ ఛాయిస్
హర్యానా రాష్ట్రంలో ప్రముఖ పట్టణం గుర్గావ్‌లో చాలా మార్కెట్‌లు ఉన్నాయి. ఇక్కడ మీరు చాలా సరసమైన ధరలకు షాపింగ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్లలో మీకు కావలసినవని కొనుగోలు చేయవచ్చు. చాలా తక్కువ బడ్జెట్‌లో, మీ అవసరానికి అనుగుణంగా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
Updated on: Aug 24, 2022 | 4:34 PM

దేశ రాజధాని ఢిల్లీలోని సమీప పట్టణం గుర్గావ్‌లో షాపింగ్ చేయాలని చూస్తున్నట్లయితే.. ఇక్కడ అనేక రకాల మార్కెట్లు ఉన్నాయి. ఈ మార్కెట్లలో చాలా సరసమైన ధరలకు వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి.

గల్లెరియా మార్కెట్ - గల్లెరియా మార్కెట్ గుర్గావ్‌లోని DLF ఫేజ్ 4లో ఉంది. మీరు ఇక్కడ నుండి మీ బడ్జెట్ ప్రకారం వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడికి వెళ్లిన వారు ఒక ఓపెన్ ఎయిర్ మాల్ అని అంటారు. స్పా, ఉపకరణాల దుకాణం, బట్టల దుకాణం, రెస్టారెంట్ మొదలైనవి ఉన్నాయి.

బంజారా మార్కెట్ - మీరు సిరామిక్, చెక్క వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే బంజారా మార్కెట్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు చాలా తక్కువ ధరలలో ఉత్తమమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇంటిని అలంకరించేందుకు మీరు ఇక్కడ నుండి అనేక వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

కుతుబ్ ప్లాజా - కుతుబ్ ప్లాజా గుర్గావ్‌లోని చాలా పాత మార్కెట్. ఇక్కడ మీరు అన్ని రకాల వస్తువులను కనుగొంటారు. ఇక్కడ చాలా బోటిక్‌లు ఉన్నాయి. అంతేకాదు రకరకాల బొమ్మలు కూడా లభిస్తాయి. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటే.. ఈ ప్లేస్ బెస్ట్ ఎంపిక

సదర్ బజార్ - గుర్గావ్‌లో ఢిల్లీ వంటి సదర్ బజార్ కూడా ఉంది. ఈ మార్కెట్‌లో చాలా దుకాణాలు ఉన్నాయి. మీరు ఈ మార్కెట్‌లో అన్ని రకాల వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు. బూట్లు, చెప్పులు, బట్టలు, పాత్రలు, ఫర్నీచర్ వరకు, మీరు ఇక్కడ అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు ఇక్కడ వీధి ఆహారాన్ని కూడా ఆస్వాదించవచ్చు.




