Vinayaka Chavithi 2022: పిల్లల పండగ వినాయక చవితి రోజున ‘పాలవెల్లి’ని ఎందుకు కడతారో తెలుసా..!

పాలవెల్లిని తమ అభిరుచికి అనుగుణంగా అలంకరించి సంతోష పడతారు. అయితే చాలామందికి వినాయక చవితి రోజున "పాలవెల్లి" ఎందుకు కడతారో తెలియదు.. మనఇంట్లో పెద్దవారు కట్టారు.. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. మేము కడుతున్నాం అని చెప్పేవారే అధికం.

Vinayaka Chavithi 2022: పిల్లల పండగ వినాయక చవితి రోజున 'పాలవెల్లి'ని ఎందుకు కడతారో తెలుసా..!
Chaviti Paalavelli
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:18 PM

Vinayaka Chavithi 2022: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఒకటి వినాయక చవితి. బొయ్యగణపయ్య పుట్టిన రోజు వేడుకలను దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అయితే వినాయక చవితి రోజున పూజాదికార్యమాలు, అలంకరణ, నైవేద్యం పూర్తిగా బిన్నంగా సాగుతాయి. అటువంటి సంప్రదాయంలో ఒకటి వినాయక చవితికి కట్టే పాలవెల్లి. చవితి ముందు రోజునుంచే పిల్లల్లో హడావిడి మొదలవుతుంది. పాలవెల్లిని అలంకరించేందుకు రకరకాల పండ్లు, మామిడి ఆకులూ, తోరణాలు అన్ని ఎంతో ఇష్టంగా రెడీ చేస్తారు. పాలవెల్లిని తమ అభిరుచికి అనుగుణంగా అలంకరించి సంతోష పడతారు. అయితే చాలామందికి వినాయక చవితి రోజున “పాలవెల్లి” ఎందుకు కడతారో తెలియదు.. మనఇంట్లో పెద్దవారు కట్టారు.. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. మేము కడుతున్నాం అని చెప్పేవారే అధికం. అయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా పాలవెల్లిని ఎందుకు కడతారో తెలుసుకుందాం..

బొజ్జ గణపయ్య పుట్టిన రోజైన భద్రప్రద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ పండగలో నైవేద్యం పెట్టె పిండివంటలు నుంచి పూజకు ఉపయోగించే పువ్వులు, ఆకులూ, అలంకరణ అన్నీ ఇతర పర్వదినాలు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా వినాయక చవితి స్పెషల్ అలంకరణ పాలవెల్లి. దీనిని కట్టడానికి వెనుక అనేక కారణాలు ఉన్నాయని పురాణాల కథనం. అనంత విశ్వంలో భూమి అణువంతే..  ఆ భూమి మీద నిలబడి ఆకాశంలోకి చూస్తే కంటికి కనిపించే సూర్యుడు, చంద్రులను తలదన్నే కోటానుకోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలు పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. ఆ పాలవెల్లికి సంకేతంగా.. పాలవెల్లిని చతురస్రాన్ని కడతారు.

గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధన.. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులుంటాయి. గణేశుని పూజ ఈ మూడు స్థితులకూ ప్రతీకలుంటాయి. సృష్టి.. భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను.. స్థితి జీవాన్ని సూచించేందుకు పత్రినీ.. లయంకి గుర్తుగా ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఏర్పాటు చేసి పుజాను చేస్తారు.

ఇవి కూడా చదవండి

గణపతి అంటే గణాలకు అధిపతి.. ఆదిపూజ్యుడు.. తొలి పూజలందుకునే దేవత.  గణపతిని పూజిస్తే.. ముక్కోటి దేవతలనూ పూజించినట్లే.. కనుక  దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితి ఏర్పటు చేస్తారు. సమస్త దేవతలకూ ప్రతికగా భావించి పాలవెల్లిని కడతారు.

పాలవెల్లిలో నక్షత్రాలకు గుర్తుగా వివిధ వస్తువులను సూచిస్తూ.. వెలగపండు, మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లతోనూ అలంకరిస్తారు.

వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడు .. గణాధిపత్యం.. ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా పాలవెల్లిని ఏర్పాటు చేస్తారు.

గణపతిని ఆడంబరంగా పూజించాల్సిన అవసరం లేదు.. స్వామివారి మట్టి ప్రతిమ ఏర్పాటు చేసి.. పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు పండగ అంగరంగవైభవంగా జరుపుకున్నట్లే.. స్వామి అనుగ్రహం దక్కినట్లే..

పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి.. మామిడి ఆకులతో అలంకరించే పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది. పాలవెల్లి లేని గణేశుని పూజ పరిపూర్ణం కాదని అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)