Janmashtami: ఆ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

సైన్స్ కూడా చెందించలేని రహస్యం ఉన్న ఆలయం ఒకటి కేరళలో ఉంది. శ్రీ కృష్ణ భగవానుడు కొలువైన ఈ ఆలయంలో.. దేవుడి విగ్రహం ఆకలితో బాధపడుతూ ఉంటుంది.

Janmashtami: ఆ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..
Thiruvarppu Krishna Temple
Follow us
Surya Kala

|

Updated on: Aug 18, 2022 | 8:34 AM

Janmashtami: భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. ప్రపంచంలో అనేక మతపరమైన ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా సనాతన హిందూ ధర్మానికి ప్రసిద్ధిచెందింది. అనేక రహస్యాలకు నెలవు. సైన్స్ కూడా చెందించలేని రహస్యం ఉన్న ఆలయం ఒకటి కేరళలో ఉంది. శ్రీ కృష్ణ భగవానుడు కొలువైన ఈ ఆలయంలో.. దేవుడి విగ్రహం ఆకలితో బాధపడుతూ ఉంటుంది. స్వామివారికి ప్రసాదం ఇవ్వకపోతే.. ఆ విగ్రహం బలహీనంగా మారుతుందని నమ్మకం. శ్రీ కృష్ణ జన్మాష్టమిని డిఫరెంట్ గా జరుపుకోవాలనుకునే స్వామివారి భక్తులు కేరళలోని ఈ ఆలయానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే:  ఈ శ్రీ కృష్ణుని ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువేరపు లేదా తిరువరప్పు ప్రాంతంలో ఉంది. ఆ ఆలయంలో ప్రతిష్టించిన కృష్ణుడి విగ్రహం ఆకలిని అస్సలు తట్టుకోదు. కనుక ఇది ఒక అద్భుత దేవాలయంగా పరిగణించబడుతుంది. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. ప్లేట్‌లో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గుముఖం పడుతుందని భక్తులు చెబుతారు. కృష్ణుడు తన మేనమామ కంసుడి సంహారం అనంతరం చాలా ఆకలితో ఉన్నాడని.. అదే విధంగా ఈ ఆలయంలోని భగవంతుని విగ్రహం ఆకలితో బాధపడుతుందని హిందువుల విశ్వాసం. స్వామివారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యం అయినా.. విగ్రహం స్వయంచాలకంగా సన్నబడటం ప్రారంభమవుతుంది.

ఆలయం కేవలం 2 నిమిషాలు మాత్రమే మూసివేత: ఈ ఆలయాన్ని రోజుకు రెండు నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. శ్రీకృష్ణుడి విగ్రహం కేవలం 2 నిమిషాలు మాత్రమే నిద్రపోతుందని చెబుతారు. ఆలయ తాళపుచెవుతో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. తలుపులు తాళం కీతో తెరవలేకపోతే.. తలుపులు తెరవడానికి గొడ్డలిని ఉపయోగంచి పగలగొట్టవచ్చు.. ఈ విషయంలో పూజారికి అనుమతి ఉంది. గత కొన్ని వందల ఏళ్లగా ఈ పద్ధతి పాటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రహణ సమయంలో తెరచిఉండే ఆలయం: ఈ ఆలయ ఆచారాలను దృష్టిలో ఉంచుకుని.. గ్రహణ సమయంలో కూడా దీనిని మూసివేయరు. గ్రహణ సమయంలో దేవతలు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని.. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రసాదం అందిస్తారు.. ఆలయ తలుపులు తెరిచి ఉంచుతారు. ఈ ఆలయంలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వ్యక్తి అతని జీవితంలో ఆకలితో బాధపడడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా