AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: మీ ఆలోచన సానుకూలంగా ఉంటే విజయం సొంతం చేసుకోవడం ఖాయం.. ఈ 5 సూత్రాలను గుర్తుంచుకోండి..

నిజానికి జీవితంలో మీ ఆలోచన ఎంత గొప్పగా.. విశాలంగా ఉంటే మీ విజయం అంత గొప్పగా ఉంటుంది. మీరు కూడా మీ జీవితంలో విజయం కోసం ఆలోచిస్తే.. ఆ ఆలోచనను మెరుగుపరచడానికి, ఆశించిన విజయాన్ని పొందడానికి..

Success Mantra: మీ ఆలోచన సానుకూలంగా ఉంటే విజయం సొంతం చేసుకోవడం ఖాయం.. ఈ 5 సూత్రాలను గుర్తుంచుకోండి..
Motivational Thoughts
Surya Kala
|

Updated on: Aug 29, 2022 | 8:36 AM

Share

Success Mantra: జీవితంలో ఆలోచనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకే దిశలో సానుకూలంగా ఆలోచించినట్లయితే.. ఆ వ్యక్తి విజయం సాధించడం ఖాయం.. అయితే వ్యక్తి తప్పుగా ఆలోచిస్తే.. వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. జీవితానికి సంబంధించిన హెచ్చు తగ్గులు తరచుగా ప్రజలకు దుఃఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఈ రెండింటి మధ్య మనిషి ఆలోచన ప్రతికూలంగా ఉండనివ్వకూడదు. నిజానికి జీవితంలో మీ ఆలోచన ఎంత గొప్పగా.. విశాలంగా ఉంటే మీ విజయం అంత గొప్పగా ఉంటుంది. మీరు కూడా మీ జీవితంలో విజయం కోసం ఆలోచిస్తే.. ఆ ఆలోచనను మెరుగుపరచడానికి, ఆశించిన విజయాన్ని పొందడానికి క్రింది ఐదు సూత్రాలను మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

  1. జీవితంలో పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు ప్రతి విపత్తులోనూ అవకాశాన్ని సృష్టించుకుంటారు. ప్రతికూలంగా ఆలోచించే వారు తరచుగా అవకాశాలను సృష్టించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
  2. జీవితంలో సుఖం, దుఃఖం రెండూ ఆలోచించడం వల్లనే వస్తాయి. మీ ఆలోచన సానుకూలంగా ఉంటే, ఖచ్చితంగా మీ చర్యలు కూడా మంచిగా ఉంటాయి. అది ఆనందానికి మాధ్యమంగా మారుతుంది. అయితే మీ ఆలోచన ప్రతికూలంగా ఉంటే, మీ చర్యలు కూడా చెడుగా ఉంటాయి. దుఃఖానికి కారణం అవుతుంది.
  3. నీ గెలుపు ఓటమికి నీ ఆలోచనే కారణం. అటువంటి పరిస్థితిలో.. మీరు వదులుకోవాలని భావించిన వెంటనే దానికి ఉన్న కారణాన్ని గుర్తుంచుకోండి.
  4. వ్యక్తి ఆలోచనలు, ఉద్దేశాలు ఎప్పటికప్పుడు విలువను బట్టి మారుతుంటాయి. అంటే టీలో ఈగ పడితే టీని బయటపడేస్తాడు. అదే నెయ్యిలో ఈగ పడితే నెయ్యి కాదు ఈగనే బయటకు పడేస్తాడు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఈ పనిని నేను ఎందుకు చేస్తున్నాను, ఫలితాలు ఎలా ఉంటాయి. నేను విజయం సాధిస్తాను. లోతుగా ఆలోచించిన తర్వాత ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించినప్పుడే, ముందుకు సాగాల్సి ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)