- Telugu News Photo Gallery Spiritual photos chanakya niti these 3 habits can ruin the life of youth leave them immediately
Chanakya Niti: యువత జీవితాన్ని నాశనం చేసే ఈ మూడు అలవాట్లకు దూరంగా ఉండమంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో యువకుల జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. చాణక్య నీతి ప్రకారం, కొన్ని అలవాట్లు యువత జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Aug 30, 2022 | 12:42 PM

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యువత తప్పు సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు, వ్యసనాల వారి మధ్య కూర్చోవడం వల్ల అవతలి వారికీ చెడు అలవాట్లు ఖచ్చితంగా వస్తాయి. దీని కారణంగా యువత తన లక్ష్యాన్ని సాధించలేదు.




