TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం.. అధికారుల కీలక నిర్ణయం
కలియుగ దైవం, వైకుంఠనాథుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ నెలకొంది. వారాంతం కావడంతో స్వామి వారిని దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం..
కలియుగ దైవం, వైకుంఠనాథుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ నెలకొంది. వారాంతం కావడంతో స్వామి వారిని దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. శ్రీవారికి కానుకల రూపంలో రూ.4.73 కోట్లు వచ్చాయి. కాగా.. ఈనెల 27 నుంచి అక్టోబరు 6వ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి గతంలోనే వివరాలు వెల్లడించారు. 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల (Brahmotsavalu) సమయంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు.. తిరమలేశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ రోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించవద్దని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఆ విధంగా భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరబోవని తెలిపింది. బ్రహ్మోత్సవాల సమయంలో చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకురావడం సాంప్రదాయంగా వస్తోంది.
తిరుమల బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు రాయలసీమ రేంజ్ డీఐజీ రవిప్రకాష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. దసరా పండుగ దృష్ట్యా తిరుమలకు భక్తుల తాకిడి ఉంటుందని, అందుకే ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదని, కాబట్టి ఈ సారి నిర్వహించే వేడుకలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పోలీసులకు భక్తులు సహకరించాలని, సూచనలు పాటించాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..