Horoscope Today: ఒక శుభవార్త వీరి ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today: ఈ రాశుల వారికి శుభఘడియలు నడుస్తున్నాయి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మేషం
చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. దూరపు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలుసుకుంటారు. దత్తాత్రేయ స్తోత్రం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
వృషభం
కీలక పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. ఎవరితోనూ అతి చనువుగా వ్యవహరించవద్దు. దుర్గా దేవిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
మిథునం
ఈ రాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. సమయస్ఫూర్తితో కీలక పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇష్ట దైవారాధనను మాత్రం మానవద్దు.
కర్కాటకం
కీలక విషయాలకు సంబంధించి అనుభవజ్ఞులను కలుస్తారు. ముఖ్యమైన పనుల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధనను మాత్రం విడిచిపెట్టవద్దు.
సింహం
వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరిస్తారు. కృష్ణాష్టకం పఠిస్తే శుభం కలుగుతుంది.
కన్య
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విందులు, వినోదాలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివస్తోత్రం జపిస్తే మంచి కలుగుతుంది.
తుల
శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమయస్ఫూర్తితో కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉమామహేశ్వరస్తోత్రం జపించడం వల్ల మేలు జరుగుతుంది.
వృశ్చికం
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కీలక విషయాల్లో ఓర్పు అవసరం. విష్ణు సహస్రరాధన వల్ల ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.
ధనస్సు
కీలక విషయాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
మకరం
శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో అలసట ఎక్కువగా ఉంటుంది. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందుతారు.
కుంభం
ఒక శుభవార్త వింటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రశంసలూ అందుకుంటారు. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవారాదన మాత్రం మానవద్దు.
మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవారాదన మాత్రం మానవద్దు.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.