Viral Video: ఓ మై గాడ్.. ఈమెకు ఇంకా భూమ్మీద నూకలు మిగిలి ఉన్నాయి.. వైరలవుతోన్న యాక్సిడెంట్ వీడియో
VC Sajjanar: రోడ్డుపై నడిచేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పక్కన ఉన్న వాహనాలను తరచూ గమనిస్తూ ఉండాలి. ఒక్కోసారి మన తప్పేమీ లేకపోయినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
VC Sajjanar: రోడ్డుపై నడిచేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పక్కన ఉన్న వాహనాలను తరచూ గమనిస్తూ ఉండాలి. ఒక్కోసారి మన తప్పేమీ లేకపోయినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ నేపథ్యంలో భయంకరమైన రోడ్డు ప్రమాదం ఒక మహిళ త్రుటిలో తప్పించుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆగి ఉన్న ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇందులో రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై ఆటో డ్రైవర్ తన ఆటోను ఎడమవైపు నిలిపి ఉంచుతాడు. అదే సమయంలో ఓ మహిళ అటువైపుగా నడుచుకుంటూ వెళుతుంది. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఆటోను ఢీకొడుతుంది. అయితే ఆ మహిళలకు ఇంకా భూమ్మీద నూకలు మిగిలి ఉన్నాయేమో. ఆటో ఒకవైపు, కారు మరోవైపు పడిపోవడంతో ఆమె తృటిలో తప్పించుకుంటుంది.
ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియోను సజ్జనార్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘త్రుటిలో తప్పించుకున్నారు. కానీ ఎంతకాలం ఇలా మనం అదృష్టం మీద ఆధారపడదాం. రోడ్లపై బాధ్యతాయుతంగా ఉండండి’ అంటూ అందరికీ సూచించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. సజ్జనార్ చెప్పినట్లు అందరూ రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరుతున్నారు.
Narrow escape but how long do we depend on luck?
Be responsible on Roads #RoadSafety pic.twitter.com/JEck2aXIuK
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 1, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..