Cricket: స్పాన్సర్లు లేక చిరిగిన షూస్.. గమ్‌తో రిపేర్లు.. సీన్ కట్ చేస్తే 3 ఓవర్లలోనే ఆసీస్ ఆటను ముగించాడు
AUS vs ZIM: ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది జింబాబ్వే. 90వ దశకంలో మేటి జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జట్టు ఆ తర్వాత క్రమంగా వైభవం కోల్పోయింది. కీలక ఆటగాళ్లు రిటైర్ కావడంతో వరుస పరాజయాలు ఎదుర్కొంది. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా బాగా ఇబ్బందిపెట్టాయి.
AUS vs ZIM: ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది జింబాబ్వే. 90వ దశకంలో మేటి జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జట్టు ఆ తర్వాత క్రమంగా వైభవం కోల్పోయింది. కీలక ఆటగాళ్లు రిటైర్ కావడంతో వరుస పరాజయాలు ఎదుర్కొంది. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా బాగా ఇబ్బందిపెట్టాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో జింబాబ్వే అంటే ఓ అనామక జట్టుగా పేరు పడిపోయింది. అలాంటి జింబాబ్వే..ఇప్పుడు చరిత్ర తిరగరాస్తోంది. మొన్నటికి మొన్న విండీస్, బంగ్లాదేశ్‌లను మట్టి కరిపించిన ఈ పసికూన తాజాగా ఆస్ట్రేలియాను ఓడించింది. అది కూడా కంగారుల సొంతగడ్డపైనే. ఏ ఫార్మాట్‌లో అయినా ఆసీస్ గడ్డపై జింబాబ్వే సాధించిన మొదటి విజయం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. తొలి రెండు వన్డేల్లో ఓడినా మూడో వన్డేలో మాత్రం అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 141 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఏడు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండిMatch summary ? pic.twitter.com/adV0yt1g94
— Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ అయిదు వికెట్లతో ఆసీస్ బ్యాటర్లను కంగారు పెట్టించాడు. కేవలం 3 ఓవర్లు వేసిన అతను 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, హార్డ్‌హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లు తన స్పిన్ మాయజాలంలో చిక్కుకుని వికెట్లు సమర్పించుకున్నారు. ఆసీస్ ప్లేయర్లు ఇతని బౌలింగ్‌లో ఒక్క ఫోర్, సిక్స్ గానీ కొట్టలేకపోయారంటే ర్యాన్ స్పిన్ మ్యాజిక్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే సరిగ్గా 15 నెలలగా స్పాన్సర్లు లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు ర్యాన్ బర్ల్. అలాగనీ సొంతంగా క్రికెట్ కిట్‌ను కొనుగోలు చేసే స్థోమత కూడా లేదు. షూస్ చిరిగిపోతే గమ్‌తో రిపేర్ చేసుకుని మైదానంలోకి దిగాడు. అలాంటి దీన స్థితిని అధిగమించిన ర్యాన్ ఆస్ట్రేలియాపై చెలరేగాడు. ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో అయిదు వికెట్లను తీసుకోవడంతో పాటు మూడు క్యాచ్‌లు పట్టాడు. అలాగే బ్యాటింగ్ లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈక్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.
#3rdODI | @ryanburl3 after his five-wicket haul ? pic.twitter.com/mHc6DSBv0X
— Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..