Viral Video: అరెరె..పెద్ద సమస్యే వచ్చిందే.. నీ కష్టం పగోడికి రాకూడదు.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు కన్నీళ్లు తెస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యపరుస్తాయి. అయితే సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఫన్నీ వీడియోలనే ఇష్టపడతారు.

Viral Video: అరెరె..పెద్ద సమస్యే వచ్చిందే.. నీ కష్టం పగోడికి రాకూడదు.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో
Follow us

|

Updated on: Sep 02, 2022 | 9:52 PM

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు కన్నీళ్లు తెస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యపరుస్తాయి. అయితే సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఫన్నీ వీడియోలనే ఇష్టపడతారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లందరూ పడి పడి నవ్వుతున్నారు. ‘చేతిదాకా వచ్చింది కానీ నోరు దాకా రాలేదు’ అన్న సామెత మీరూ వినే ఉంటారు. ఈ వీడియోను చూస్తే ఈ సామెత గుర్తుకురాక మానదు. ఇందులో ఒకతని ఇయర్‌ పాడ్‌ మురికి గుంతలో పడిపోతుంది. గుంతపై ఇనుప కమ్మీలు ఉండడంతో చేతులు పెట్టి తీయడం సాధ్యం కాదు. దీంతో అతను దారం లాంటి ఒక తీగతో ఎయిర్‌ పాడ్‌ను తీయడానికి ప్రయత్నిస్తాడు.

ఎలాగోలా తీగ సహాయంతో ఎయిర్‌పాడ్‌ను బయటకు తీసుకొస్తాడు. ఇక చేతికి వచ్చేసింది అనేలోపే ఇనుప కమ్మీలు తగిలి మళ్లీ మురికి గుంతలోకి పడిపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక పెద్ద మనిషి తల పట్టుకుంటాడు. ఆ సమయంలో అతని ముఖంలో కనిపించే ఎక్స్‌ప్రెషన్స్‌ను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. kamakaaziiii అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే 25 లక్షల మంది లైకుల వర్షం కురిపించారు. నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు, రియాక్షన్లు ఇస్తున్నారు.ఒక యూజర్ ‘అంకుల్ చాలా దురదృష్టవంతుడు’ అని రాస్తే ‘ఇది బ్రేకప్ కంటే చాలా బాధాకరం’ అని మరో యూజర్ ఫన్నీ కామెంట్‌ పెట్టారు. అదే సమయంలో, ‘నేను ఇయర్‌బడ్స్ కొనకపోవడానికి ఇది కూడా ఒక కారణం’ అని మరో యూజర్‌ స్పందించాడు. మరి నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. హాయిగా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kamakazi (@kamakaaziiii)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles