Fact Check: అయోధ్య రామ మందిరానికి కేజీఎఫ్‌ హీరో రూ.50 కోట్ల విరాళం.. అసలు విషయం ఏంటంటే ?

Yash: రామమందిర నిర్మాణానికి 'రాకింగ్ స్టార్' యష్ 50 కోట్ల రూపాయల విరాళమిచ్చాడని ఓ వార్త బాగా స్ర్పెడ్‌ అవుతోంది. ఇటీవల ఆయన రామమందిరాన్ని దర్శించుకున్నారని, ఈ సందర్భంగానే భారీ విరాళం ప్రకటించారని నెట్టింట్లో ఒక పోస్ట్‌ తెగ చక్కర్లు కొడుతోంది

Fact Check: అయోధ్య రామ మందిరానికి కేజీఎఫ్‌ హీరో రూ.50 కోట్ల విరాళం.. అసలు విషయం ఏంటంటే ?
Yash
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2022 | 12:32 PM

Yash: కేజీఎఫ్‌ (KGF) సిరీస్‌ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యష్‌. ముఖ్యంగా కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2తో ఆయన క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్‌ హీరోల సినిమాలను మించి ఈ చిత్రం కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కోట్లలో పారితోషికం తీసుకునే నటుల్లో యశ్‌ కూడా ఒకరు. ఆయన తదుపరి సినిమా ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకీభాయ్ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త బాగా వైరలవుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందు కోసం దేశంలోని లక్షలాది మంది విరాళాలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రామమందిర నిర్మాణానికి ‘రాకింగ్ స్టార్’ యష్ 50 కోట్ల రూపాయల విరాళమిచ్చాడని ఓ వార్త బాగా స్ర్పెడ్‌ అవుతోంది. ఇటీవల ఆయన రామమందిరాన్ని దర్శించుకున్నారని, ఈ సందర్భంగానే భారీ విరాళం ప్రకటించారని నెట్టింట్లో ఒక పోస్ట్‌ తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

యష్ ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. కర్ణాటకలోని సరస్సుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుదల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. యష్ సంస్థ ‘యశోమార్గ’ ద్వారా చాలా మందికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అయితే రామమందిర విరాళంపై వస్తున్న వార్తలు మాత్రం శుద్ధ అబద్ధం. రాకీభాయ్‌ ఇటీవల అయోధ్యను సందర్శించుకున్నది నిజమే. ఈ సమయంలోనే రామమందిర నిర్మాణానికి 50 కోట్ల రూపాయల విరాళం ఇస్తానని యష్‌ ప్రకటించాడు’ అని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్‌ చేశారు. దీంతో పాటు ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే అది అయోధ్య సందర్శన ఫొటో కాదు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమా విడుదలకు ముందు అతను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పటి ఫొటోలను ఉపయోగించి ఇప్పుడు రూ.50 కోట్ల విరాళమంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.

యశ్ గురించి సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న పోస్ట్ ఇదే..

ఇవి కూడా చదవండి

Social Media Post

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..