Megastar Chiranjeevi: కంగారుగా షూటింగ్స్‌ చేయవద్దు.. డైరెక్టర్లకు చిరంజీవి స్వీట్‌ వార్నింగ్‌

First Day First Show Pre Release Event: దర్శకులు మంచి కథలపై దృష్టి సారించాలని, కంగారుగా షూటింగ్‌ చేయవద్దని మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) సూచించారు. బుధవారం జరిగిన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Megastar Chiranjeevi: కంగారుగా షూటింగ్స్‌ చేయవద్దు.. డైరెక్టర్లకు చిరంజీవి స్వీట్‌ వార్నింగ్‌
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2022 | 10:26 PM

First Day First Show Pre Release Event: దర్శకులు మంచి కథలపై దృష్టి సారించాలని, కంగారుగా షూటింగ్‌ చేయవద్దని మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) సూచించారు. బుధవారం జరిగిన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రేక్షకులు థియేటర్లు రావడం లేదనేది అపోహ మాత్రమే. మంచి కంటెంట్‌ ఉంటే ఆడియెన్స్‌ తప్పక సినిమాలను ఆదరిస్తారు. దర్శకుడు సినిమా సరిగ్గా తీయకపోతే చాలామంది జీవితాలు తలకిందులవుతాయి. కాబట్టి దర్శకులు మంచి కథలపై దృష్టి సారించాలి. నటీనటుల డేట్స్ క్లాష్‌ అవుతున్నాయని కంగారు కంగారుగా షూటింగ్‌ చేయవద్దు. ప్రేక్షకులకు ఏది అవసరమో అదే అందించాలి’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

కాగా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అందించిన కథతో తెరకెక్కిన చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. శ్రీకాంత్‌రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ఈ సినిమా ముందుకురానుంది. ప్రమోషన్లలో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగానే సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..