Diabetic Diet: బెల్లం లేదా తేనె.. డయాబెటిక్ రోగులకు ఏది మంచిదో తెలుసా?
Honey vs Jaggery: డయాబెటిక్ బాధితులు డైట్ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. రుచిగా ఉంటుందని ఏది పడితే అది తినకూడదు. డైట్ విషయంలో నియంత్రణ పాటించకపోతే శరీరంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి.
Honey vs Jaggery: డయాబెటిక్ బాధితులు డైట్ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. రుచిగా ఉంటుందని ఏది పడితే అది తినకూడదు. డైట్ విషయంలో నియంత్రణ పాటించకపోతే శరీరంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఫలితంగా వ్యాధి మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే షుగర్ పేషెంట్లు ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. చక్కెరకు బదులు బెల్లం, తేనెతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఈ రెండింట్లో ఏది మంచిదనేది ఒకసారి తెలుసుకుందాం రండి.
మధుమేహ బాధితులకు పంచదారం ఏ మాత్రం మంచిది కాదు. చక్కెరకు బదులు బెల్లం ఉపయోగిస్తే మంచిది. పంచదార, బెల్లం రెండింట్లోనూ గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు ఏ మాత్రం మంచిది కాదు. ఇక తేనె విషయానికొస్తే.. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఇది చాలా ప్రయోజనకరం. దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. బెల్లంతో పోలిస్తే షుగర్ బాధితులకు తేనె అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఇందులో ఆరోగ్య పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా తేనెలో ప్రోటీన్లు, ఫైబర్, షుగర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కాపర్, జింక్, విటమిన్ సి తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. అలాగే పలు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి