Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: రోజుకు ఎన్ని గుడ్లు తింటున్నారు? అతిగా తింటే ప్రాణాలకే ప్రమాదం..!

ఎక్కువైతే అమృతం కూడా విషమవుతుంది..అనే సామెత మీరు వినే ఉంటారు. గుడ్లు కూడా అంతే.. గుడ్లు మితంగా తినడం మంచిది. ఎక్కువ గుడ్లు తినడం వల్ల..

Health: రోజుకు ఎన్ని గుడ్లు తింటున్నారు? అతిగా తింటే ప్రాణాలకే ప్రమాదం..!
Plastic Eggs
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 01, 2022 | 2:48 PM

Health: సాధారణంగా అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో గుడ్లు తినడానికి ఇష్టపడేవారు మనలో చాలా మంది ఉన్నారు. గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. రోజుకు ఒక గుడ్డు తినడం నిజానికి ఒక సూపర్ ఫుడ్. కానీ,అతిగా తింటే..ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే దీన్ని రోజూ తినాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, తినడంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి మంచిదని గుడ్లు అధికంగా తింటే కొన్ని నష్టాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎక్కువ గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు 1. అతిసారం.. ఎక్కువైతే అమృతం కూడా విషమవుతుంది..అనే సామెత మీరు వినే ఉంటారు. గుడ్లు కూడా అంతే.. గుడ్లు మితంగా తినడం మంచిది. ఎక్కువ గుడ్లు తినడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. అధిక విరేచనాలతో శరీరం బలహీనంగా మారిపోయి.. అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది.

2. మలబద్ధకం.. ఎక్కువ గుడ్లు తినడం మన జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది మలబద్ధకం సమస్యకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో కడుపు చికాకు, గ్యాస్ సమస్యల ప్రమాదం కూడా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

3. కొలెస్ట్రాల్.. గుడ్డు సొనలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది సంతృప్త కొవ్వు వలె హానికరం కాదు. అయితే ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు గుడ్లు తక్కువగా తినాలి.

4. బరువు పెరుగుదల.. గుడ్డులో కొవ్వు ఉంటుంది. మీరు ఎక్కువ గుడ్లు తిన్నప్పుడు మీ శరీరం వినియోగించే కేలరీలను సమతుల్యం చేయదు. దీని కారణంగా మీరు బరువు పెరగడం ప్రారంభిస్తారు. మీరు ఎక్కువ గుడ్లు తీసుకుంటే అది నేరుగా మీ బరువును ప్రభావితం చేస్తుంది.

5. మధుమేహం వచ్చే ప్రమాదం గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని ముందే చెప్పుకున్నాం.. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు,..మన శరీరంలో చక్కెర పరిమాణం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. షుగర్ నియంత్రణలో లేకపోతే.. ఆ వ్యక్తి మధుమేహంతో బాధపడాల్సి వస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి