Viral Video: ఎమిరేట్స్ ఎయిర్ హోస్టెస్‌కు విమానంలో అందమైన అనుభవం..కౌగిలించుకుని మురిసిపోయిన వైనం.. వీడియో వైరల్

ఒక అందమైన చిన్న పిల్లవాడు తన చేతిలో బోర్డింగ్ పాస్ పట్టుకుని విమానంలోకి ఎక్కాడు. విమానంలోకి వస్తున్న ఆ చిన్న కుర్రాడు ఎయిర్‌హోస్టెస్‌కు బోర్డింగ్ పాస్ చూపించాడు.

Viral Video: ఎమిరేట్స్ ఎయిర్ హోస్టెస్‌కు విమానంలో అందమైన అనుభవం..కౌగిలించుకుని మురిసిపోయిన వైనం.. వీడియో వైరల్
Air Hostess
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 01, 2022 | 12:58 PM

Viral Video: కొన్నిసార్లు కొన్ని కొన్ని క్షణాలు చాలా ప్రత్యేకమైనవిగా మారతాయి. అలాంటి అద్భుతమైన, మధుర క్షణాలను ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఆ అనుభూతిని పొందలేము..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఇందులో ఒక ముద్దులొలికే బుడతడు విమానంలోకి ప్రవేశించే ముందు క్యాబిన్ సిబ్బందికి తన బోర్డింగ్ పాస్ ఇవ్వడం కనిపిస్తుంది. అయితే, ఇందులో విశేషముంది.. విమానంలో ప్రయాణించాలంటే ఎవరైనా సరే తమ బోర్డింగ్‌ పాస్‌ చూపించాల్సిందే కదా..? అది పిల్లవాడైతేనేమీ..? పెద్దవాళ్లయితేనేమీ అనే సందేహం కలుగుతుంది కదా..? కానీ, ఇక్కడో ఓ పెద్ద విశేషమే ఉందండోయ్‌..అదేంటో వీడియోలోనే చూడాలి మరీ..

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక అందమైన చిన్న పిల్లవాడు తన చేతిలో బోర్డింగ్ పాస్ పట్టుకుని విమానంలోకి ఎక్కాడు. విమానంలోకి వస్తున్న ఆ చిన్న కుర్రాడు ఎయిర్‌హోస్టెస్‌కు బోర్డింగ్ పాస్ చూపించాడు. అది తీసుకున్న ఆమె ఒకింత ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే.. ఆ బోర్డింగ్ పాస్ అందించిన కుర్రాడు మరెవరో కాదు.. ఆ ఎయిర్‌ హోస్టెస్‌ కుమారుడే. తన కుమారుడిని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. వెంటనే అతడిని కౌగిలించుకుని మురిసిపోయింది. ఈ అందమైన వీడియోను చూద్దాం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by V E E (@flygirl_trigirl)

తల్లీ కొడుకుల ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో flygirl_trigirl అనే ఖాతాలో షేర్‌ చేయబడింది. యూజర్ క్యాప్షన్‌లో, తన జీవితంలో తాను ఓ అతి పెద్ద వీఐపీని కలిశానని, చాలా ఆనందంగా ఉందని, దుబాయ్‌కి తిరిగి వెళ్తున్నామంటూ ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించింది. ఆగస్టు 24న షేర్ చేసిన ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో తల్లీ కొడుకుల ఈ క్యూట్ వీడియోపై నెటిజన్లు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాలో వేలాది లైకులు, కామెంట్లను సొంతం చేసుకుంది.

ఒక వినియోగదారు కామెంట్‌ చేస్తూ… ఉత్తమ క్యాబిన్ సిబ్బంది అని రాశారు. అదే సమయంలో ఈ వీడియో నేను మర్చిపోలేనిది అంటూ కామెంట్‌ చేశారు. మరొక వినియోగదారు ఓహ్ మై గాడ్,.. ఎంత అందమైన క్షణం అంటూ కామెంట్ చేశారు. ఓవరాల్ గా ఎయిర్ హోస్టెస్… తన చిన్న కొడుకుకు సంబంధించిన ఈ మనోహరమైన వీడియో ఎంతోమంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది.

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే