AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మాయిని బెదిరించిన చైన్‌స్నాచర్లకు గట్టి గుణపాఠం చెప్పిన కారు డ్రైవర్‌.. సరైందే అంటున్న నెటిజన్లు..!

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బైకర్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలను తుపాకీతో దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, అప్పుడు ఒక కారు డ్రైవర్

Viral Video: అమ్మాయిని బెదిరించిన చైన్‌స్నాచర్లకు గట్టి గుణపాఠం చెప్పిన కారు డ్రైవర్‌.. సరైందే అంటున్న నెటిజన్లు..!
Car Hits Bike Rider
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2022 | 5:43 PM

Share

Viral Video: చోరీలు, దోపిడీలు, స్నాచింగ్‌ల వంటి కేసులు తరచూ నమోదవుతున్నాయి. బైక్‌లపై వేగంగా వచ్చి ప్రజల వస్తువులను దోచుకెళ్తుంటారు. కొందరు దొంగలు తమ వెంట ఆయుధాలు తీసుకెళ్లడం కూడా కనిపిస్తుంది. ఆ ఆయుధాల బలంతో పట్టపగలు ఎవరినైనా దోచుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది నిజంగానే షాకింగ్‌ వీడియో అంటున్నారు నెటిజన్లు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బైకర్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలను తుపాకీతో దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, అప్పుడు ఒక కారు డ్రైవర్ వచ్చి వారికి తగిన గుణపాఠం చెప్పాడు.. అతను తన కారుతో చాలా బలంగా ఢీకొట్టాడు..దాంతో వారు అక్కడే పడిపోయారు.. ఆ తరువాత కుంటుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించారు. బైక్ నడుపుతున్న దొంగలు ముందుగా అబ్బాయిలను, అమ్మాయిలను భయపెట్టి, వారి వస్తువులను దోచుకోవడానికి ఎలా ప్రయత్నించారో వీడియోలో మీరు చూడవచ్చు. అయితే వెనుక నుండి వస్తున్న కారును చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, కారు డ్రైవర్‌ వేగంగా వారి బైక్ ను ఫాలో అయ్యారు.. కారుతో బైక్ ని గట్టిగా ఢీ కొట్టాడు. దాంతో ఆ బైకర్లు ఒక్కసారిగా అంత దూరంలో ఎగిరిపడ్డారు.  కానీ, కారు డ్రైవర్ దిగి వచ్చే లోపుగానే దొంగలు  వారి బైక్ తో సహా ఎస్కేప్ అయ్యారు. అయితే,  బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడు కుంటుతూ నడుస్తున్నట్టుగా మనకు వీడియోలో కనిపిస్తుంది. కార్ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయిన తర్వాత కూడా అతడు..కుంటుతూ..వెంటనే పైకి లేచి తిరిగి బైక్ ఎక్కాడు.. ఇక బైక్ రైడర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన బైక్‌ను తీసుకొని అక్కడ్నేంచి ఇద్దరూ ఉడాయించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @semladroes ఐడి ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఈ 34 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 4.4 మిలియన్లకు పైగా వీక్షించారు..అంటే 44 లక్షల కంటే ఎక్కువ సార్లు వీడియోని చూశారు. అయితే 1 లక్ష 78 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ఈ వీడియో చూసిన జనాలు రకరకాలుగా స్పందించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ కారు డ్రైవర్ మాత్రం దొంగలకు తగిన గుణపాఠం చెప్పాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి