Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గణపతి విగ్రహానికి సీట్ బెల్ట్ పెట్టిన డ్రైవర్.. మహీంద్రా అండ్ మహీంద్రా వినూత్న సందేశం..

వినాయక చవితి శుభాకాంక్షలతో పాటుగానే.. ప్రజలకు ఓ సరికొత్త సందేశాన్ని అందించారు. అది చూసిన ప్రతిఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఆనంద్ మహీంద్రా విడుదల చేసిన ఆ సరికొత్త సందేశం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: గణపతి విగ్రహానికి సీట్ బెల్ట్ పెట్టిన డ్రైవర్.. మహీంద్రా అండ్ మహీంద్రా వినూత్న సందేశం..
Anand Mahindra
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 01, 2022 | 2:38 PM

Viral Video: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పోస్ట్‌తో నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే మహీంద్రా & మహీంద్రా గ్రూప్ తరపున గణేష్‌ చతుర్థి సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలతో పాటుగానే.. ప్రజలకు ఓ సరికొత్త సందేశాన్ని అందించాడు. అది చూసిన ప్రతిఒక్కరూ ఆ దిశగా ఆలోచిస్తున్నారు..? ఆనంద్ మహీంద్రా విడుదల చేసిన ఆ సరికొత్త సందేశం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..ఒక ట్రక్కు డ్రైవర్ సీటుపై కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు.. అతని పక్కన సీటుపై ఆ గణేశుడి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏటంటే డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చుని ఉన్న వినాయకుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాడు. ఆ విఘ్నేశుడు కూడా డ్రైవర్ లాగా సీట్ బెల్ట్ పెట్టుకుని కనిపిస్తు్న్నాడు. వినాయక ఉత్సవాల సందర్బంగా ప్రజలు, వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, సీటు బెల్ట్‌ ప్రముఖ్యతను తెలియజేసేలా వినాయకుడి రూపంలో సీట్ బెల్ట్ గురించి చెప్పే ప్రకటనను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన ఢిల్లీ టీచర్ మను గులాటీ.. ‘‘గణపతి సీట్ బెల్ట్ ధరించడాన్ని ఎవరైనా చూశారా? అంటూ రీ ట్విట్‌ చేశారు. ఇకపై ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను అనుసరించాలని గుర్తు పెట్టుకోండి అంటూ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే డ్రైవర్ల కోసమే ఈ సందేశం. ఇది నిజంగా అద్భుతమైన వీడియో.. అంటూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి